ఘనముగా సన్మానం

తూర్పుగోదావరి జిల్లా పోలీసు విభాగంలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన డి. రామకృష్ణ( హెడ్ కానిస్టేబుల్) ని ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పి డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్.



తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఈరోజు (30.04.2025) పదవి విరమణ సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పదవి విరమణ చేసిన డి. రామకృష్ణ( హెడ్ కానిస్టేబుల్-2185), ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ  డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., సాలువ కప్పి ఘనముగా సన్మానం చేసి పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను అందజేసినారు.



ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... వీరు పోలీస్ డిపార్ట్మెంట్ కు చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడినారు. వారి భావి జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసినారు. 

ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ (ఎస్ బి) ఏ. శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ (ట్రాఫిక్)  బాలశౌరి, ఆర్ ఐ సంజీవ్, జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. రఘురాం ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.