60 సంవత్సరాలు వయసు, 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో ప్రాక్టీస్ లో ఉన్న న్యాయవాదులకు నెలకు 10,000 పింఛన్ సౌకర్యం కల్పిస్తాం......
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో భాగంగా మేనిఫెస్టోను విడుదల చేసిన కిల్లి. మార్కండేశ్వర రావు...
శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా పట్టణ న్యాయవాదుల బార్ అసోసియేషన్ హాల్లో పత్రికా, మీడియా మిత్రులకు ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో కిల్లి. మార్కండేశ్వర రావు 2026 రాష్ట్ర ఎలక్షన్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు వయసు , 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో ప్రాక్టీస్ లో ఉన్న న్యాయవాదులకు నెలకు 10,000 పింఛన్ సౌకర్యం, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్, జ్యూడిషల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే న్యాయవాదులకు ఉచిత కోచింగ్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ప్రాక్టీస్ లో ఉండిన న్యాయవాదులు ఆకస్మికంగా మరణించిన వారికి ఇప్పుడు ఇస్తున్న ఎక్స్గ్రేషియా కన్నా ఎక్కువ 15 లక్షలు పెంచడానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా యువ న్యాయవాదుల క్రీడాకారులకు, పోటీలకు సంబంధించిన క్రీడా మెటీరియల్ అందిస్తానని తెలిపారు. ముఖ్యంగా మహిళా న్యాయవాదులకు ప్రత్యేక గదులను కేటాయిస్తామని, న్యాయవాదులకు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తంగి. శివ ప్రసాద్, కార్యదర్శి పిట్ట. దామోదర్, సీనియర్ న్యాయవాదులైన ఆగూరు ఉమామహేశ్వరరావు, భవానీ, ప్రసాద్, సుర. వేణుగోపాలరావు , కొమ్ము. రమణ మూర్తి, త్రిపురాన. వర ప్రసాద్, బి. ఏస్ చలం, కొమరాపు ఆఫీసు నాయుడు, పి. నాగేశ్వరరావు, కూన. వాసు, మామిడి క్రాంతి, జిల్లా బార్ పూర్వ అధ్యక్షులు వాన. కృష్ణ చంద్, ఎన్ని. సూర్యారావు, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
