27న ఛలో రాజ్ భవన్
రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక సంఘాల నిర్ణయం
మాజీ మంత్రి, ఏపి ఎస్ కెఎం కన్వీనర్ వడ్డే
విజయవాడ: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం యధావిధిగా కోనసాగించాలని కోరుతూ ఈ నెల 27వ తేధీన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించతలపెట్టామని కోరుతూ మాజీ మంత్రి, ఎస్ కెఎం కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు వెల్లడించారు. 2005 ఉపాధి హామీ చట్టం కోనసాగించాలని డిమాండ్ చేశారు. బుధవారం యంబివికె భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ జి రాంజీ జి పేరుతో తెచ్చిన కొత్త చట్టాన్ని ఆయన రద్దు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు, పేద రైతులకు, ఇతర వృత్తిదారులకు పని కల్పించిన పథకమని కొనియాడారు. అలాంటి పథకాన్ని బిహార్ ఎన్నికల తరువాత హాడావిడిగా పార్లమెంట్ ఏర్పాటు చేసి ఈ నెల 18న పార్లమెంట్ లోక్ సభ, ఆ తరువాత 19న రాజ్యసభ ఏర్పాటు చేసి హడావిడిగా రాష్ట్రపతి, హైదరాబాద్ లోని ఉపారాష్ట్రపతితో సతంకాలు చేయించి, చట్టం చేశారని ఎన్ డిఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సి ఎం కె. పవన్ కళ్యాణ్ నోరుమెదపడం లేదని విమర్శించారు.
కేంద్రానికి సయ్యటలాడుతున్నారని హేళన చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్రం వాటా 10% మాత్రమే ఉండేవాన్నారు. బిజెపి ఆధికారంలోకి వచ్చిన తరువాత నిధులు తగ్గిస్తూ, ఈరోజు ఉపాధి హామీ ఎత్తివేయాలని కుట్రపన్నాదని విమర్శించారు. జిఎస్ టి కడుతూ రాష్ట్రాలు ఈ వాటా భరించాలంటే కష్టసాధ్యమన్నారు. గతంలోనే అమలుకానీ చట్టం, ఇపుడు అమలు చేస్తారని ఉహించలేమన్నారు. 100 పనిదినాలను 125 పెంచుతూ చట్టం చేయటం విడ్డూరంగా ఉందన్నారు. పేరు మార్చి, ఉపాధి హామీ ఎత్తేసే చట్టమన్నారు. సీనియర్ రైతు సంఘం నాయకులు వై. కేశవరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ పేరు తీసి, ఆయన విద్రోహులైన ఆర్ ఎస్ ఎస్ ముద్దు బిడ్డలు బిజెపి ప్రభుత్వం ఈ ఘాతుకానికి ఉసికోల్పోపిందన్నారు. దీనికి ఎన్ డిఏ పక్షాలు మౌనంగా ఉండటం సహకరించటమేనని ఏద్దేవా చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల చంద్రశేఖర్ మాట్లాడుతూ 2021లో ఈ పథకానికి 1 లక్ష 11 వేలు నిధులు కేటాయించగా, ఇపుడు కేవలం 86వేలు కేటాయించటాన్ని బట్టి ఉపాధి హామీ నిధులు పెరిగాయ, తరిగాయ అర్ధం చేసుకోవచ్చాన్నారు. ఈ పథక చట్టం ఆచరణలో ఎత్తివేయాలనే పథక రూపకల్పనే ఈ చట్టం ఉద్ధేశ్యమన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటాపంచుల జమలయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు, కొత్త చట్టం తేవటం, క్రమేణ ఎత్తివేయాలనే షతరులను నిరసిస్తూ ఈ నెల 27 న జరిగే లెనిన్ సెంటర్ నుంచి బందర్ రోడ్డు మీదుగా ప్రదర్శన, అనంతరం రాజ్ భవన్ లో గవర్నర్ కి వినతి సమర్పణ కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులు, చిన్న రైతులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్నికి సభ అధ్యవర్గంగా వ్యవసాయం కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, మరో సంఘం అధ్యక్షులు సిహెచ్. కోటేశ్వరరావు వ్యవహారించారు. విలేకరుల సమావేశంలో ఏఐకెఎం రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, సి ఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ముజఫర్ అహ్మద్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వంకాయపాటి రాణీ, ఎన్టీఆర్ జిల్లా ఏపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అప్పల స్వామి ఉన్నారు.

