వైజాగ్ పోర్ట్ అథారిటీ కోసం..
60T BP టగ్ కు షిప్ యార్డ్ కీల్ వేసి పనులు ప్రారంభం
- మరో టగ్ నిర్మాణానికి పోర్ట్ తో ఒప్పందం
షిప్ యార్డ్ కు జంట మైలురాళ్లను దక్కాయి
దేశంలోనే మొట్టమొదటి నౌకా నిర్మాణ కేంద్రంగా సుధీర్ఘ చరిత్ర గల హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) ఈనెల 22 తేదీ సోమవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అవసరాలకు దేశీయ పరిజ్ఞానంతో షిప్ యార్డ్ లో మొదటి 60T బొల్లార్డ్ పుల్ నిర్మాణానికి తొలి ప్లేట్ కీల్ వేసి పనులు ప్రారంభించింది.
అనంతరం 2వ 60T బొల్లార్డ్ పుల్ టగ్ నిర్మాణం కోసం షిప్ యార్డ్ , పోర్ట్ ట్రస్ట్ తో ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి. ఈ నేపథ్యంలో షిప్ యార్డ్ ముఖ్యమైన మైలురాయిని సాధించింది, వైజాగ్ పోర్ట్ తో దీర్ఘకాలిక, విశ్వాస పూరిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోందని పోర్ట్, షిప్ యార్డ్ ప్రతినిధులు, ఇరు సంస్థలు అభిప్రాయ వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో మారిటైమ్ ఇండియా విజన్ 2030, ఆత్మనిర్భర్ భారత్‌తో లక్ష్య సాధనకు 60-టన్నుల BP రెండు టగ్‌లు పోర్టు నౌకాదళాన్ని ఆధునీకరిస్తాయని, ఇరు సంస్థలు భవిష్యత్తు వృద్ధికి తోడ్పడతాయని ఇరు సంస్థల ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
డిమాండ్ ఉన్న పోర్ట్ కార్యకలాపాల కోసం రూపొందించబడిన 60 టన్నుల బొల్లార్డ్ పుల్‌తో 32.5 మీటర్ల పొడవైన టగ్, పెరుగుతున్న సముద్ర ట్రాఫిక్ మధ్య సురక్షితమైన నౌక నిర్వహణ, వేగవంతమైన మలుపు, మెరుగైన సామర్థ్యాన్ని అనుమతిస్తుందని వివరించారు.
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్‌పర్సన్ డాక్టర్ మధయ్యన్ అంగముత్తు, (IAS) మాట్లాడుతూ, సమయానుకూల డెలివరీ, నాణ్యమైన పనితనం విశ్వాసాన్ని పెంచుతుందని, షిప్ యార్డ్ తో సహకారం పోర్ట్ , జాతీయ సముద్ర పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పెరుగుతున్న కార్గో వాల్యూమ్‌లు, ప్రతిష్టాత్మకమైన భవిష్యత్తు లక్ష్యాలతో, ఇటువంటి టగ్‌లు, అనుబంధ మౌలిక సదుపాయాలు చాలా కీలకమని పేర్కొన్నారు.
అనంతరం షిప్ యార్డ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సీఎండీ గిరిదీప్ సింగ్ మాట్లాడుతూ... విశాఖపట్నం పోర్ట్ అథారిటీ , టెక్నాలజీ భాగస్వాములు, వేదం - సోలాస్ మెరైన్ వారి నిరంతర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. జంట మైలురాళ్ళు షిప్ యార్డ్ యొక్క బలమైన సాంకేతిక సామర్థ్యం, డెలివరీ పనితీరు మరియు బలమైన ప్రాజెక్ట్ నిర్వహణ వ్యవస్థలను ప్రదర్శిస్తాయని, సకాలంలో డెలివరీ, నాణ్యత, కస్టమర్ సంతృప్తి, మేక్-ఇన్-ఇండియా షిప్‌బిల్డింగ్ పట్ల షిప్ యార్డ్ నిబద్ధతను పునరుద్ఘాటించాయని పేర్కొన్నారు.
పరస్పర విశ్వాసం, భాగస్వామ్య జాతీయ లక్ష్యాలు, స్వదేశీ సామర్థ్యం, (ఎమ్ఎస్ఎమ్ఇ) భాగస్వామ్యం నైపుణ్యం కలిగిన ఉపాధి కల్పన ద్వారా భారతదేశ సముద్ర పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి నిబద్ధతలో పాతుకుపోయిన శాశ్వతంగా స్థిర పడాలని ఆకాంక్షించారు.






