ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం



 ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం ద్వారా 2.50 లక్షల గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో బొంతు వీర లక్ష్మీ గారి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి పసుపు కుంకుమ కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను ఇంటి తాళం అందచేసిన రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ.



ఈ కార్యక్రమంలో వీరితోపాటు కోరుకొండ మండలం అధికారి అశోక్ కుమార్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.