విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో మల్కాపురం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణంరాజు,మహిళా కానిస్టేబుల్ ఎల్ భవాని కి సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ ప్రశంసా పత్రంతో సత్కరించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ ఫోక్సో కేసు విషయంలో హెడ్ కానిస్టేబుల్ కృష్ణంరాజు, భవాని నిందితుడిని పట్టుకోవడం, కోర్టు వ్యవహారాలలో చాకచక్యంగా వ్యవహరించడంతో తన శైలి డెడికేషన్ అభినందనీయం అని సిటీ పోలీస్ కమిషనర్ కొనియాడారు. ఆ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఆయన చేతుల మీదుగా ప్రశంసా పత్రం ఇచ్చి అభినందించారు. ఇంతకీ ఆ కేసు ఏమిటో అనుకుంటున్నారా, 2017 సంవత్సరంలో మల్కాపురం జాలారి వీధిలో సొంత మనవరాలనే తాతయ్య లైంగిక వేధింపులకు గురిచేయడం తో అప్పట్లో ఆ ఘటనపై మల్కాపురం పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేస్ నమోదు చేయబడింది. ఆ కేసు పూర్వపరాలు ఆధారంగా 2024 సంవత్సరంలో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రశంసనీయమైనది. అందులో క్రియ శీలక పాత్ర వహించిన హెడ్ కానిస్టేబుల్ ఇతర సిబ్బందికి సిటీ పోలీస్ కమిషనర్ చేతుల మీదగా ప్రశంస పత్రం అందించారని సమాచారం. ఈ ఘటనతో ఎప్పటికైనా అన్యాయం జరిగిన వారికి న్యాయం జరుగుతుందని ప్రజల్లో ఉన్నత న్యాయస్థానాలపై, రక్షక భటులు నిర్వహించే శాంతి భద్రతలపై విశ్వాసం ధైర్యం ఏర్పడింది అనే చెప్పాలి.