కులం చిచ్చు.. నూతన వరుడు దారుణ హత్య... కూటమి ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి.. నిందితులను కటినంగా శిక్షించాలి..
విశాఖపట్నం: 05.03.26: B2B NEWS: మండపేట మండలం, ద్వారపూడికి చెందిన, పోలిపల్లి సూర్యనారాయణ కుమారుడు, పోలిపల్లి వీర వెంకట సూర్య ప్రకాష్, మండపేట మండలం, జెడ్ మేడపాడు గ్రామానికి చెందిన, అయినవిల్లి సంధ్య (ప్రస్తుత రాయవరం డిప్యూటీ తాసిల్దార్), చాలాకాలంగా ప్రేమించుకుంటున్నా నేపద్యంలో వీరిద్దరూ గతవారం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు ప్రేమ వివాహం చేసుకొనగా, పెళ్లి అయిన మరునాడే వధువు డిప్యూటీ తాసిల్దారు అయినటువంటి సంధ్య సోదరులు వరుడు సూర్య ప్రకాష్ ఇంటికి వెళ్లి, అతి దారుణంగా బయటకు లాక్కొచ్చి అత్యంత కిరాతకంగా, పాశవికంగా, రాళ్లతో కొట్టి చంపారు.
హత్య జరిగి వారం కావస్తున్న బాధితులకు ఎటువంటి న్యాయం జరగలేదని, హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ, ఈరోజు విశాఖపట్నం, అఖిల గాండ్ల, తెలికుల, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిల గాండ్ల, తెలికుల, సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు డాక్టర్ దాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో విశాఖ పట్టణం మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి, తక్షణమే ప్రభుత్వం ద్వారా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రని అందజేశారు.
అనంతరం విశాఖ పట్టణ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో కమీషనర్ కు కలసి వారికి జరిగిన దారుణ సంఘటన గురించి, తెలియపరుస్తూ ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రిప్రెజెంటేషన్లు అందజేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరారు.
విశాఖ జిల్లా, అఖిల గాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ దాడి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, లోకేష్ కు, హోమ్ మినిస్టర్ అనిత కు కూడా వినతులు పంపించి సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అత్యంత వెనుకబడిన కుటుంబానికి చెందిన సూర్య ప్రకాష్ కుటుంబాన్ని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, వారి కుటుంబంలో, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, జీవనాధారం కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
వధువు సంధ్య, వరుడు సూర్యప్రకాశరావు, ఇరువురు ఒకరికి ఒకరు ఎన్నో ఆశలతో క్రొత్త జీవితాన్ని గడపాలని దేవుణ్ణి సన్నిధిలో ప్రేమ వివాహంతో ఒక్కటైనా మరునాడే, వధువు సంధ్య సోదరులు ఎంతో దారుణంగా, పాసవికంగా హత్య చేశారని, సూర్యప్రకాశరావు అత్యంత వెనుకబడిన, గాండ్ల, తెలికుల, కులానికి చెందిన వ్యక్తి కావడంతో,
ఆమానవీయంగా, కిరాతకంగా, అత్యంత దారుణంగా, పాసవికంగా, హత్య చేసిన, వధువు సోదరులను, కఠినంగా శిక్షించాలని, సమాజంలో, భవిష్యత్తులో, ఇటువంటివి, పునరావృతం, కాకుండా కఠిన చర్యలు తీసుకొనవలసినదిగా, మరియు కుటుంబానికి ఆధారమైన, పెద్ద దిక్కును, కోల్పోయారని అత్యంత వెనుకబడిన, పేద కుటుంబీకులైన, పోలిపల్లి సూర్యనారాయణ కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.






