శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం లోని మధుర మీనాక్షి ఫంక్షన్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా సాధికారత కార్యక్రమం సత్య సాయి జిల్లా పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథిగా సత్య సాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విశిష్ట అతిథిగా హిందూపురం అదనపు జిల్లా న్యాయమూర్తి శైలజ, డిఎస్పీ మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్, షేక్ షబ్బీర్, ఉబెదుల్లా హుసేన్ అతిథులుగా పాల్గొన్నారు. 62 సంవత్సరాలు వయసు ఉన్నా తలసీమియా చిన్నారుల కోసం రక్తదానం చేసిన ఎన్ .రాజ శేఖర్ రెడ్డి ఉపాధ్యాయునికి అభినందన పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఎన్ .రాజ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మానవత రక్త దాతల సంఘం వ్యవస్థాపకులు తరిమెల అమర్నాథ్ రెడ్డి, సలీం ల స్పూర్తి తో 2004 లో తొలిసారి రక్తదాత గా మారినాను . ఇంత వరకు 13 సార్లు రక్త దానం చేయడం జరిగింది. 2005 లో మానవత, జనవిజ్ఞాన వేదిక , ఇండియన్ రెడ్ క్రాస్ ల సహకారం తో మడకశిర రక్తదాతల సమన్వయ కమిటీ ఏర్పరచుకొని 800 మంది రక్త దాతల జాబితాను రూపొందించి, అవసరమున్న పేదలకు రక్తం అందచేయటం శాస్త్రీయ ఆలోచనలు పాఠశాల, కళాశాలలో చైతన్య కార్యక్రమాలు అందిస్తూ , రక్త దాన సేవా కార్యక్రమాలు , నేత్ర దానం, మరణానంతరం దేహదానం వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధనలకు ఇచ్చే విధంగా వీలునామ లు 2010 లో ఇచ్చాము.
అప్పటి నుండి హిందూపురం దేహదాతల సంఘం కన్వీనర్ గా వ్యవహరిస్తూ అవగాహన సమావేశాలు నిర్వహిస్తూ 70 మంది దేహదాతలు వీలునామలు సేకరించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు అవసరమున్న పేద ప్రజలకు విధిగా రక్తం అందించి ఋణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సమాజం నుండి మనం పొందేది కొండంత !! ఋణం తీర్చే కొనేది గోరంత!! అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఎస్పీ తో మాట్లాడుతూ అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం సేవలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణా కర్ణాటక లో ఇప్పటి వరకు 23వేల తలసీమియా చిన్నారులకు, ప్రసవాలకు, అత్యవసర శస్త్ర చికిత్సలకు, రక్తహీనత బాధితులకు, రక్త దాతల ద్వారా అందజేశామని ఒక వెయ్యికి పైగా కోవిడ్ మహమ్మారి వలన చనిపోయిన అనాధ శవాలకు కుల మతాలకు అతీతంగా అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అభినందిస్తూ ఇక ముందుకు కూడా సేవలు కొనసాగించాలని అన్నారు.


