విశాఖలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం సిటీ డిపోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రీజనల్ మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ శ్రీ బీ.అప్పలనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో 3300 మంది ఉద్యోగులకు, 500 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని, వీరిలో ముఖ్యంగా అనేక మంది మహిళలు వివిధ విభాగాలలో తమ సేవలు ఏపీఎస్ ఆర్టీసీ కు అందిస్తున్నారని తెలిపారు. దీనిలో విశిష్ట సేవలు అందించిన వారికి 500 రూపాయలు చొప్పున నగదు అవార్డు రూపంలో మరియు అప్రిసియేషన్ లెటర్స్ శ్రీమతి బి. రమాదేవి, సీనియర్ అసిస్టెంట్, శ్రీమతి కె.అనురాధ, సీనియర్ అసిస్టెంట్, శ్రీమతి టి. ప్రశాంతి, సూపరింటెండ్, పి. టి. జ్యోతి, కండక్టర్, కె ఏస్. కుమారి లకు అందజేస్తు మహిళలకు ఉన్న హక్కులన్నీ కూడా ఉపయోగించుకోవాలని, ఏవైనా సమస్యలు వస్తె ఈ జిల్లాలో ముఖ్య అధ్యక్షతన డిపో మేనేజర్ శ్రీమతి మణి మాధురి ఉన్నారని, వారికి ఫిర్యాదులు అందజేయాలని తద్వారా సరైన ఎంక్వయిరీ చేసి వారిపై చర్య తీసుకొంటామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ సిటిఎం శ్రీమతి కె.పద్మావతి మాట్లాడుతూ మహిళలు వారి యొక్క హక్కులను ఎప్పటికప్పుడు సాధించుకోవాలంటూ, పూర్వకాలం లో సతీసహగమనం దగ్గర నుండి ఇప్పటివరకు కూడా మహిళలు ఎన్నో సాధించుకోవడం జరిగినదని మరింత అభివృద్ధి చెందాలని కోరినారు.
మధురవాడ డిపో మేనేజర్ శ్రీమతి దుర్గా మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహిళలు ముందుకు సాగాలని తెలియజేయగ, విశాఖపట్నం డిపో మేనేజర్ శ్రీమతి మాధురి మాట్లాడుతూ మహిళలు వారి యొక్క విధులను సక్రమంగా చేసుకుంటూ ముందుకు సాగాలని తద్వారా విజయాలు వాటంతట అవే వస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లా డిపో మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్ జె.తిరుపతి, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


