ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు

పదవ తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు-గుండాల మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎస్సై సైదులు.



ఈ సందర్భంగా గుండాల మండల ఎస్సై సైదులు బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి ఫలితాలను విడుదల చేయడం జరిగింది.గుండాల మండల పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు అని తెలిపారు. ఇంటర్ మీడియట్ దశ మీ జీవితంలో మలుపు తిరిగే దశ మంచి మార్గం వైపుగా వెళ్ళాలి చెడు వ్యసనాలకు బానిసలూ కాకుండా జీవితంలో ఒక లక్ష్యం నిర్ణహించుకొని లక్ష్యం సాదించే దిశగా భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదిగేవిధంగా నిర్ణయం తీసుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొనే విదంగా ఉన్నతమైన చదువులు చదివి యాదాద్రి జిల్లాకు,మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.