విద్యార్థుల తల్లిదండ్రులకు సూచన

మీ పిల్లలు ఉత్తీర్ణులు కాకపోతే పక్కనే ఉండి ధైర్యం చెప్పండి-సుద్దాల వేద పండితులు వేపా నర్శింహ మూర్తి



మీ పిల్లల మార్కులను ఇతర పిల్లలతో పోల్చకండి ఏ ఇద్దరు ఓకే జ్ఞానాన్ని కలిగి ఉండరు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఫలితాలు కేవలం అంకెలు మాత్రమే మన విలువకు కొలమానం కావు మీ పిల్లలు ఉత్తీర్ణులు కాకపోతే పక్కనే ఉండి ధైర్యం చెప్పండి మరల ఉత్తీర్ణత సాధించడానికి మీ వంతు సహకరించండి మార్కులే జీవితం కాదు ఒకప్పుడు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి నిన్న యుపిఎస్సి సివిల్ సర్వీస్ లో ర్యాంక్ సాధించడం జరిగింది గెలుపోటములు సహజం జీవితంలో ప్రతి ఓటమి ఒక అనుభవంగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను ఈరోజు విజయం సాధించిన వారు ఎన్నో అపజయాలు పాలై ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు అందుకోసమే మార్కులు ఇంపార్టెంట్ కాదు సబ్జెక్టు నాలేజ్ ఉంటే చాలు అందుకోసమే తల్లిదండ్రుల్లారా మీరు ప్రోత్సహించకపోతే ఎవరు ప్రోత్సహిస్తారు దయచేసి డిసప్పాయింట్ చేయకండి.