మే 2 వ తేదీన జరిగే రాష్ట్రవ్యాప్త మన్యం బంద్ ని జయప్రదం చేయాలని దండకారణ్య విమోచన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కిల్లో మనోజ్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీలో ఆదివాసి గిరిజన నిరుద్యోగులందరికీ పూర్తిగా అన్యాయం చేశారని 96% గిరిజనేతలు మాత్రమే పోస్టింగ్లు ఇస్తూ ఆదివాసులకి అన్యాయం చేస్తున్నారని, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అరకువేలి బహిరంగ సభలో ప్రకటన చేసి నేటికీ సంవత్సరం కావస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వ అధికారంలో వస్తే జీఓ. నెంబర్ 3 ని పునరుద్ధరణ చేస్తామని ఆర్డినెన్స్ జారీ చేస్తామని మీకు న్యాయం చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి హామీని తుంగలు తొక్కి ఆదివాసి నిరుద్యోగులకు తీవ్ర మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని తక్షణమే మెగా డీఎస్సీ కాకుండా ఆదివాసి గిరిజన డిఎస్సి ఐటిడిఏ ద్వారా 100% ఉద్యోగాలు ఆదివాసి నిరుద్యోగులతోనే భర్తీ చేయనని డిమాండ్ చేస్తూ ఈనెల 2 వ రెండో తారీఖున శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఐటీడీఏ పరిధిలో జరిగే బందును జయప్రదం చేయాలని ఆదివాసి నిరుద్యోగులు అందరు కూడా పాల్గొని బందుని విజయవంతం చేసి మన యొక్క నిరుద్యోగులకు ఆవేదన ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేయపరిచేలాగా అందరు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.