“పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం” కార్యక్రమానికి 34 ఫిర్యాదులు...

జిల్లా పోలీస్ కార్యాలయంలో “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”(పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమం నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ( అడ్మిన్) శ్రీ ఎన్.బి.ఎం మురళీకృష్ణ మరియు అడిషనల్ ఎస్పి( లా అండ్ ఆర్డర్) ఏ.వీ సుబ్బరాజు.
నేటి పోలీసు “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం” కార్యక్రమానికి 34 ఫిర్యాదులు.



రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "ప్రజా సమస్యల పరిష్కార వేదిక "పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”, (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు అడిషనల్ ఎస్పీ( అడ్మిన్) శ్రీ ఎన్. బి.ఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పి( లా అండ్ ఆర్డర్) ఏ.వీ సుబ్బరాజు నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించినారు.



ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక “పి.జి.ఆర్.ఎస్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా ది. 12.05.2025 తేదీన తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన "పి.జి.ఆర్.ఎస్" కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఫిర్యాదులను పరిశీలించి, వారి కష్టాలను, బాధలను స్వయంగా అడిగి తెలుసుకుని, వెనువెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసినదిగా ఉత్తర్వులు ఇచ్చినారు.



నేటి పోలీసు “పి.జి.ఆర్.ఎస్” కార్యక్రమానికి 34 ఫిర్యాదులు రాగా, వీటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు మరియు ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడమైనది.