రైతులకు 4 లక్షల 50 వేల మొక్కల ఉచిత పంపిణీకు అవగాహన ఒప్పందం
రైతుల ఆర్థిక అభివృద్ధి ఉద్యానవన అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా పెట్టుకొని స్థానిక అసిస్ట్ మరియు వ్యవసాయ ఆధారిత టెక్నాలజీ సంస్థ వరహా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందాన్ని వ్యవస్థాపకులు డాక్టర్ జాస్టి రంగారావు మరియు వరాహ భాగస్వామ్యాల మేనేజర్ ఎం ఎస్ ఎన్ మూర్తి పరస్పరంగా మార్చుకున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం వచ్చే సీజన్లో ఐదు కోట్ల 24 లక్షల రూపాయల విలువ కలిగిన 4,50,000 మామిడి జీడి కొబ్బరి నిమ్మ ఎర్రచందనం మరియు టేకు మొక్కలను ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 10 జిల్లాల్లోని రైతులకు ఉచితంగా పంచనున్నారు. ఈ కార్యక్రమంలో ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరులు అందుబాటులోకి రాగా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడనుంది అని తెలియజేశారు.
ఈ సందర్భంగా జాస్తి రంగారావు మాట్లాడుతూ అసిస్ట్ స్థాపన నుండే గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది వరాహ సంస్థతో భాగస్వామ్యంగా పండ్ల తోటలు మరియు వనజాతుల మొక్కల ఉచిత పంపిణీ ద్వారా గ్రామీణ రైతులను స్థిరమైన ఆదాయం మార్గాలవైపు నడిపించగలమనే విశ్వాసం మాకు ఉంది అన్నారు.
ఎంఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ వరాహ పంటల శాస్త్రీయ విశ్లేషణ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి లక్ష్యంగా పెట్టుకుంది, అసిస్ట్ తో కలిసి పని చేయడం వలన మా లక్ష్యం గ్రామీణ స్థాయిలో విజయవంతంగా అమలవుతోంది అన్నారు.