కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

"మే డే" ప్రపంచ కార్మికుల పోరాట దినం-కార్మికుల జీవితాలపై గుదుబండగా ఉండే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి.



విశాఖపట్నం జిల్లా గాజువాక 67వ వార్డు సిపిఎం పార్టీ శాఖ మరియు సిఐటియు మరియు వివిధ ప్రజా ఉద్యమ సంఘాలు ప్రతినిధులు తో ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను లిఖించిన దినముగా పిలవబడే మేడే సందర్భంగా కామ్రేడ్ కే కిరీటం అధ్యక్షతన కామ్రేడ్ కేపీ కుమార్, పర్యవేక్షితమైన కామ్రేడ్ సంతోషం సూచనలతో ఈరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాలలో వివిధ కార్మిక సంఘాలు కార్మికులతో సిఐటియు పతాకావిష్కరణ జరిగినట్లు శాఖా కార్యదర్శి కామ్రేడ్ లక్ష్మణస్వామి పాలూరు తెలియజేశారు. 



మొదటగా 67వ వార్డు జోగవాణిపాలెం సచివాలయం వద్ద జీవీఎంసీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మస్తర్ పాయింట్ వద్ద "మే డే" జెండా సీనియర్ పారిశుద్ధ్య కార్మికుల చేతుల మీదుగా ఎగరవేయడం జరిగింది ఇక్కడ కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు సాగింది. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ వివిధ రకాల కార్మిక సంఘ నాయకులు మరియు కార్మికులు పాల్గొనడం జరిగింది. కొత్త గాజువాక బస్ స్టాప్ దగ్గర వివిధ ఫ్రూట్స్ మర్చంట్స్ మరియు కళాశీల ఆధ్వర్యంలో "మే డే" జెండా సీనియర్ "ఫ్రూట్స్ మర్చంట్" గొలుగు రామిరెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రూట్స్ మర్చంట్స్ చిన్న రెడ్డి, శ్రీను, గంగాధర మరియు "మేస్త్రీలు" అప్పలనాయుడు, రాజారావు, నాగేశ్వరరావు, రమణ, తదితరులతోపాటు కొన్ని పదుల మంది కళాసిలు పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి శాఖ నాయకులతో పాటు గాజువాక జోన్ నాయకులు కామ్రేడ్ లోకేష్, కామ్రేడ్ ఎల్ బంగారు నాయుడు మొదలగువారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం 8 గంటల 30 నిమిషముల నుండి 10 గంటల వరకు ఉత్తేజపూరితమైన పాటలతో కార్యక్రమం జరిగింది. సాయిరాం నగర్ స్వామి విద్యానికేతన్ దరి ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 67వ వార్డు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గాజువాక జోన్ శాఖ సభ్యులు లోకేష్ మరియు బంగారు నాయుడు, పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు తుంపాల శ్రీరామ్ మూర్తి, మధు మాస్టర్, అంబులెన్స్ యూనియన్ నాయకులు రాజయ్య, శాఖ ప్రతినిధులు కుమార్, కిరీటం, సంతోషం, గోవింద, లక్ష్మణ స్వామి, మరియు ఆక్సిలరీ శాఖ సభ్యులు కృష్ణవేణి, కళ్యాణి, ప్రాంత నాయకులు పాలూరు దేవి, మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నట్లు శాఖా కార్యదర్శి కామ్రేడ్ లక్ష్మణ స్వామి పాలూరు తెలిపారు. ప్రధానంగా ఎనిమిది గంటలు పని నిలబెట్టుకోవడం ఒక సవాల్ లేబర్ కోడ్లు అమలు కాకుండా అడ్డుకోవడం మరో సవాల్ ఈ రెండు సవాల్ వ్యతిరేకంగా పోరాడడానికి యావత్ కార్మిక వర్గం ఈ మేడే స్ఫూర్తితో ప్రతిని భూనాలని మరియు కార్మికులకు నష్టం కలుగజేసే చట్టాలను కష్టమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోవాలి మరియు మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి అని సిఐటియు నాయకులు మాట్లాడినట్లు పి ఎల్ స్వామి తెలిపారు.