చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి...
కోవూరు నియోజకవర్గ కొడవలూరు మండలం పెయ్యల పాలెం గ్రామంలో జరిగిన చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆమే మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం అభివృద్ధి వైపు నడిపిస్తున్నామని నియోజకవర్గంలో ప్రజలందరికీ అవినీతి రహిత పాలన అందిస్తున్నామని అధికారులు సంక్షేమ పథకాలు గురించి సచివాలయం దగ్గర ప్రజలకు అందుబాటులో ఉండేలాగా అవగాహన కార్యక్రమంలో జరిపించాలని ప్రతి పథకం ప్రజలకు చేరు అవ్వాలని నాయకులు అందుకు సహకరించాలని కోరారు తాను ఎలక్షన్ ప్రచారంలో ప్రతి గ్రామానికి త్రాగునీరు అందిస్తానని మాట ఇచ్చానని అలాగే నియోజకవర్గంలో త్రాగు నీరు ప్రతి ఇంటికి, ప్రతి రైతుకు సాగునీరులు అందిస్తూ ముందుకెళుతున్నామని తెలియజేశారు.
ప్రభుత్వ వాగ్దానంలో భాగంగా 4000 పెన్షన్ అందిస్తున్నామని మహిళలకు.ఉచితంగా మూడు సిలిండర్లుఇస్తున్నామని అలాగే ప్రజలు ఇంటి పట్టాలు అడుగుతున్నారని లేని వారందరికీ జెసి తో మాట్లాడి వచ్చేలా చూస్తామని ప్రజలకుహామీ ఇచ్చారు.
ప్రజలకు కావలసిన ప్రతి ఒక్క అభివృద్ధి పనులను ఎంపీ నిధులతో కలిపి ఎన్డీఏ కూటమిలో చేసి చూపిస్తామని కొడవలూరు మండలం ఇండస్ట్రియల్ కి అనువైన ప్రాంతమని పరిశ్రమలు ఎన్నో వస్తున్నాయని కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ అభివృద్ధి పనులు అమ్ముతాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.