ఘనంగా రామలింగేశ్వర స్వామి ధ్వజారోహణ పూజలు...

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం లో వెలసిన శ్రీ గంగా సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అత్యంత వైభవంగా అర్చకుల చే కోడి ముద్దలు, ధ్వజారోహణ పూజలు ఆలయం నందు నిర్వహించారు. 



ఈ సందర్భంగా మండల టిడిపి నాయకులు బెజవాడ కృష్ణారెడ్డి, ఆవుల వాసు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి మల్లికార్జున్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.