శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్మిక సంఘం 6వ జిల్లా మహాసభ జయప్రదం చేయడానికి బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలో ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు D రాధయ్య P రాజయ్య ల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆటో జిల్లా అధ్యక్ష, కార్యదర్సు లు మారుబోయిన రాజా, కోలగట్ల సురేష్ పాల్గొని మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఈ జిల్లాలో 7000 మంది కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తూ అతిపెద్ద గుర్తింపు పొందిన కార్మిక సంఘంగా కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తా ఉంది అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపై అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎప్పటికప్పుడు కార్యక్రమాల రూపొందిస్తూ కార్మికుల సంక్షేమం కోసం మరియు వాళ్ళ అభివృద్ధి కోసం పోరాటం కొనసాగిస్తా ఉంది అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఆటో కార్మికులకి 15000 రూపాయలు వాహన మిత్ర పథకం ద్వారా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
అయితే అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన కూడా ఇంతవరకు వాహన మిత్ర పథకం అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం భారతదేశ కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోట్లుగా చేసింది ఈ నాలుగు లేబర్ కోడలు రద్దు చేయాలని జులై 9వ తేదీ దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అంతేకాకుండా ఆటో 6వ జిల్లా మహాసభకు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రతినిధులు కార్మికుల పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం సహాయ కార్యదర్శి నున్న సురేష్ బుచ్చి మండల ఆటో నాయకులు వడ్డీ మాల్యాద్రి, బి దుర్గ, P రమేష్ B మల్లికార్జున M బాలకృష్ణ A శ్రీనివాసులు G నాగరాజు V శ్రీనివాసులు K వెంకటేశ్వర్లు SK ఖాజా పాల్గొన్నారు.