జూలై 9 సమ్మె జయప్రదం చేయండి...మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజు..
కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న దేశ వ్యాప్త సమ్మను మున్సిపల్ కార్మికుల విజయవంతం చేయాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రాజు కోరారు.
జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జోన్ 3 మహాసభ మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో ఉన్న కామ్రేడ్ సీతారాం ఏచూరి భవనంలో కే కుమారి అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య వక్తలుగా యు రాజు పాల్గొని మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను కాలరాస్తూ యజమానులకు అనుకూలంగా లేబర్ కోర్సును తీసుకువచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్స్అమలు అయితే కార్మికులు బానిసలుగా మారుతారన్నారు. కార్మికులకు నష్టదాయకమైన ఈ లేబర్ కోడ్స్ ను రద్దు చేయించుకోవడమే యూనియన్ ప్రధాన లక్ష్యం అన్నారు.
కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులర్ కార్మికులతో సమానంగా వేతనం చెల్లించాలని జీవిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, సిఐటియు గౌరవాధ్యక్షుడు పి. వెంకటరెడ్డి, అధ్యక్షులు టీ నూకరాజు డిమాండ్ చేశారు. మహాసభలో ముందుగా గడచిన మూడేళ్లలో మృతి చెందిన కార్మికులకు నివాళు లర్పించారు. యూనియన్ ఆధ్వర్యంలో జోన్ పరిధిలోని 10 వార్డుల్లో పోరాటాలు విజయాలను కార్యదర్శి జె. ఆర్ప్ర.నాయుడు ప్రవేశపెట్టారు.
మరణించిన, అనారోగ్యానికి గురైన కార్మికుల స్థానే వారి కుటుంబీకులకు ఉద్యోగాకాశం కల్పించకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంతమంది కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని, కార్మికుల సమస్యలపై కౌన్సిల్లో హామీలే తప్ప అమలు జరగడం లేదని మండిపడ్డారు.
అనంతరం 22 మందితో నూతన కమిటీ ఏర్పాటైంది. గౌరవాధ్యక్షులుగా వి కృష్ణారావు, అధ్యక్షులుగా ఆర్ శ్రీనివాస్, కార్యదర్శిగా జేఆర్ నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కే కుమారి, ఉపాధ్యక్షులుగా కొండమ్మ, వెంకటరమణ, హాయ్ కార్యదర్శిగా లలిత, జగదీశ్వర్లు తోపాటు మిగిలిన వాళ్ళు కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ మహాసభలో సిఐటియు మద్దిలపాలెం జోన్ అధ్యక్షులు డి అప్పలరాజు, కార్యదర్శి పి వెంకట్రావు, ఉపాధ్యక్షులు వి నరేంద్ర కుమార్, మున్సిపల్ యూనియన్ జిల్లా ఆఫీస్ బేరర్ గొలగాని అప్పారావు, ఈ ఆదినారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.