తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సుద్దాల హనుమంతు కు ఘన నివాళులు..
సుద్దాల హనుమంత్ వర్ధంతి సందర్భంగా జోహార్లు అర్పించిన ఎర్రజెండా నాయకులు...
సమసమాజ నిర్మాణం కోసం పోరాడిన ఆనాటి నేతలే నేటి తరానికి ఆదర్శం...
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా పేద ప్రజలకోసం తమ జీవితాలను అంకితం చేసి పోరాడిన నాటి అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకోసం నేటితరం కమ్యూనిస్టులు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు హరిచంద్ర అన్నారు.మంగళవారం సుద్దాల హనుమంత్ వర్థంతి సందర్భంగా స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కుసుమని హరిచంద్ర మాట్లాడుతూ భారత దేశంలో 100 సంవత్సరాల ఉద్యమ పార్టీగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత వార్షికోత్సవాలు జరుపుకుంటున్నదని భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆ తర్వాత దేశ ప్రజల సామాజిక రాజకీయ ఆర్థిక హక్కుల కోసం సుదీర్ఘమైన గర్వకారణమైన పోరాటాలు అనేకం నడిపింది సిపిఐ పార్టీ అని గుర్తు చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మహోత్తర ఉద్యమాలు నడిపింది సంస్థానాల విలీనంలో ప్రధాన పోరాట పాత్ర కమ్యూనిస్టు పార్టీది అని భారతదేశంలో అతి పెద్దదైన నైజాం సంస్థానం అత్యంత నికృష్ట పరిస్థితుల్లో ఉండేదని వెట్టి చాకిరి తీవ్రమైన దోపిడీ లక్షలాది ఎకరాల భూ కేంద్రీకరణ ప్రజలను తీవ్ర దరిద్రానికి గురిచేసిందని సిపిఐ నాయకత్వంలో మహోత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందని ఇట్టి పోరాటాలు కమ్యూనిస్టుల నాయకత్వం కిందనే జరిగినవన్నీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి సభ్యులు కుసుమని హరిచంద్ర,మండల కార్యదర్శి ఆనంతుల రామచంద్రయ్య,సహాయ కార్యదర్శి పడకంటి సత్యనారాయణ,ఎండి షేముషాదీన్,ఎలా కృష్ణారి,బద్ధుల శ్రీనివాస్, బద్ధుల స్వామి,బక్కయ్య, చంద్రయ్య,వీరయ్య,తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు.