పట్టణ ఆరోగ్య కేంద్రములను ఆకస్మిక తనిఖీ నిర్వర్తించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి..
విశాఖపట్నం, ఈరోజు అనగా తేదీ 24.01.2026 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు సిద్దేశ్వరం మరియు గిరిజా కోలనీ పట్టణ ఆరోగ్య కేంద్రములను సందర్శించి అక్కడ జరుగుతున్న ఓపి సేవలు, అభ ఐడి రిజిస్ట్రేషన్, ANM సేవల గురించి సమీక్ష చేశారు.
ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీ సేవలు, NCD 4.O స్క్రీనింగ్, సాధ్యమైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండాలని మరియు EHR, IHIP, RCH కూడా నమోదు చేయాలని సిబ్బందికి పలు సూచనలు చేసారు. సిబ్బంది అందరూ FRS హాజరు అందరు విదిగా వేయాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. సిబ్బంది ఎవరైనా క్షేత్ర సందర్శనకు వెళ్ళేటప్పుడు విధిగా మూవ్మెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని లేని పక్షంలో తగిన చర్యలు గైకొనబడతాయని మరియు సూపర్వైజర్స్ తమ సందర్శనలను సంబందిత ఏ.ఎన్.ఎంలతో హై రిస్క్ గర్భిణీ లను గుర్తించి డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లి చికిత్స అందించవలెనని మరియు సంబందిత ఏ.ఎన్.ఎంల ద్వారా అభ ఐ.డి, ఎన్.సి.డి.4.0, ఆర్.సి.హెచ్. ఇండికేటర్స్ అప్డేట్ చేయించాలని ఆదేశించారు.
ఈ సందర్శనలో డా.బి.ఉమావతి, DPMO-NHM, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

