విశాఖపట్నం: ఈ రోజు తేది 24.01.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి సమక్షంలో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం నుండి సత్యం కూడలి మీదుగా నిర్వహించగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు మాట్లాడుతూ ఈ సంవత్సరం థీం “డిజిటల్ ఎంపవర్మెంట్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ & కెరీర్స్, హెల్త్ న్యూట్రిషన్ అండ్ ఎండింగ్ జెండర్ బయాస్” గురించి వివరిస్తూ మరియు PC&PNDT Act (లింగ నిర్ధారణ చట్ట రీత్యా నేరం) పై అవగాహన కలుగచేసారు.
డెమో అధికారి బి.నాగేశ్వర రావు PC&PNDT చట్టం గురించి తెలియచేస్తూ స్త్రీ, పురుషులు సమానమని, కాని ఈ నిష్పత్తి రాష్ట్రంలో 919 ఉండగా మన విశాఖపట్నం జిల్లాలో 932 గా ఉన్నదని మరియు జనవరి 24 వ తేదిన జాతీయ బాలికా దినోత్సవం జరుపుకోవడం జరిగిందని తెలియచేస్తూ, బేటి బచావో – బేటి పడావో అను నినాదంతో అందరూ పనిచేయాలని లింగ బేధం ఉండకూడదని తెలియచేయాలని, బాలికలు చదువుకోవడం వలన తను ఉన్నత స్థితి లోకి రావడమే కాకుండా కుటుంబాన్ని అంతా అభివృద్ధి పదంలో పయనించడానికి అవకాశం ఉంటుందని తెలియచేశారు. ఈ PC&PNDT చట్టం యొక్క లక్ష్యం, దానివలన ఉండే లాభాలు జిల్లాలో జరుగు జిల్లా స్థాయి సమావేశంలు అందరూ తెలుసుకోవాలని తెలియచేశారు.
ఈ ర్యాలీ నందు జిల్లా ప్రోగ్రాం అధికారులు, మరియు కార్యాలయ సిబ్బంది, రీజనల్ ట్రైనింగ్ సెంటర్ నర్సింగ్ విద్యార్ధులు పాల్గొన్నారు.


