ఉచితంగా 300 మందికి మెడికల్ క్యాంప్..

విశాఖపట్నం అన్ ఆర్గనైసేడ్ వర్కర్స్ యూనియన్ వారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గం 40 వార్డు ఏకేసి కాలనీలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసారు.  



ఈ  క్యాంపులో ముఖ్యమైన పరీక్షలు అయినటువంటి గుండె, ఊపిరితిత్తులు, కళ్లు, దంతాలు, ఇఎన్టి, షుగర్, బీపీ, ఈసీజీ ,బిఎంఐ మరియు ఎముకలకు సంబంధించిన పరీక్షలు,  ఫుల్ బాడీ కి సంబంధించిన పరీక్షలు అన్నీ ఉచితంగా ప్రజలకు చేపించారు. మెడికల్ క్యాంపు కు విచ్చేసిన ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మెడికవర్ హాస్పిటల్, ఇండస్ హాస్పిటల్స్,  ఏఐఎన్యు, హాస్పిటల్, టి ఎస్ ఆర్ హాస్పిటల్స్, శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి హాస్పిటల్, ప్రముఖ మల్టీస్పెషల్టి హాస్పిటల్ వచ్చి ఏకేసి కాలనీ 40 వార్డు ప్రజలందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు అందజేసి వైద్య పరీక్షల్లో లోపాలు వచ్చిన వారికి ఉచితంగా ఇన్సూరెన్స్ పై సర్జరీ చేయుటకు హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు. ఈ మెడికల్ క్యాంపుకు సుమారు 300 మంది హాజరై ఉచితంగా చికిత్స పొందారు. ఈ  మెగా మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథిగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరశురామరాజు,  మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు డాక్టర్ కరణం రెడ్డి నరసింగరావు, ఎమ్మెల్యే గణబాబు తనయుడు మౌర్య  సింహ, విశాఖపట్నం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ములకపల్లి  ప్రకాష్,  40 వార్డు అధ్యక్షురాలు మేఘన దుర్గ, టిడిపి పశ్చిమ నియోజకవర్గ యువత ఉపాధ్యక్షుడు గుత్తుల మధుబాబు, మల్కాపురం మండల అధ్యక్షులు రాజారావు, గాజువాక లక్ష్మీ ఫర్నిచర్ అధినేత వెంకీ, మరియు ఏ కే సి కాలనీ ప్రజలు, యువత, విశాఖపట్నం అన్ ఆర్గనైసేడ్ వర్కర్స్ యూనియన్ మెంబర్స్ మధుబాబు, ఏసు, నిర్మల్, జోగా, లీలా, ప్రసాద్, రవి, లోకేష్, వెంకటేష్, నానాజీ, కేకే రాజు, నాగరాజు, శ్రీనివాస్, రావాడ ప్రసాద్, మురళి, ఠాగూర్, ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ  మెడికల్ క్యాంప్ ని విజయవంతంగా పూర్తి చేశారు.