నూతన రాజకీయ పార్టీ ఆవిష్కరణ చేస్తున్న ఆర్ ఏం పీ కొండి శెట్టి సురేష్

భారత దేశ చరిత్రలో ఒక గ్రామీణ వైద్యుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమం 14 వ తేదీ డిసెంబర్ ఆదివారం ఉదయం 9.34 గంటలకు రాజకీయ పార్టీనీ ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆవిష్కరించడం నూతన చరిత్ర.



ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండి ప్రధమ చికిత్స చేస్తూ ప్రజలతో మమేకమై, వారి కుటుంబ సభ్యుని వలె ఉంటూ వారియొక్క కుటుంబ పరిస్థితులు, సాధక బాధలు తెలుసుకొంటూ పేద, మధ్యతరగతి, ధనికుల స్థితిగతులు, పరిస్థితులు, జీవన విధానం, ప్రస్తుత ఇబ్బందులు అన్ని విషయాలలో గ్రామీణ వైద్యులకు ఒక అవగాహన కలిగిఉంటారు. స్వాతంత్రం వచ్చినప్పటినుంచి నేటి వరకు ఒక గ్రామీణ వైద్యుడు రాజకీయ పార్టీని స్థాపించడం రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి పార్టీని ఆవిష్కరించడం నూతన చరిత్ర. కొందరు చరిత్రలు తిరగ రాయడానికి ఈ భూమి మీదకి వస్తారు. ఒకప్పుడు గుడివాడ నుండి వెండి ధరపై ఒక వెలుగు వెలిగిన మహానుభావులు రాజకీయ పార్టీలు స్థాపించి చరిత్రలు సృష్టించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అదే కోవకు చెందిన కొండి శెట్టి సురేష్ బాబు గుడివాడలో పుట్టి పెరిగి జీవనం కోసం విజయవాడలో ఉంటూ అనేక వ్యవస్థలలో పని చేయుచు నేడు నూతన రాజకీయ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ బ్రోకర్ గా ఆవిష్కరణ చేయుచున్నారు గౌరవ డాక్టర్ అవార్డు గ్రహీత, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత, పబ్లిక్ సోషల్ సర్వీస్ హీరో అవార్డు గ్రహీత, రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డా. కొండి శెట్టి సురేష్ బాబు.


విజయవాడ గాంధీ నగర్ హనుమంతరాయ గ్రంథాలయం నందు ఘనంగా అభిమానుల మధ్య పెద్దల ఆశీస్సులతో నూతన రాజకీయ పార్టీ ఆవిష్కరణ చేయుచున్నారు.  స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్నిక సమయంలో రాజకీయ పార్టీలు గ్రామీణ వైద్యులకు హామీలు ఇవ్వడం,  హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వక పోవటం, హామీలు నేర వేర్చకపోవటం తరాలుగా జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి గౌ. డా. కొండి శెట్టి సురేష్ బాబు అభిమానులు, శ్రేయోభిలాశులు, మీడియామిత్రులు, గ్రామీణ వైద్యులు, ప్రజా నాయకులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్నారని డాక్టర్. కొండి శెట్టి సురేష్ బాబు విజయవాడ తన కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేశారు.