ఘనంగా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం..
బ్రహ్మకుమారి ల 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..
డాబాగార్డెన్స్ డిసెంబరు 20. ధ్యానం జ్ఞాన శక్తిని పెంపొందించడమే కాకుండా మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుందని ఆంధ్ర యూనివర్సిటీ యోగ డైరెక్టర్ భాను కుమార్ అన్నారు.
శనివారం డాబా గార్డెన్స్ వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో ప్రజా పిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భానుకుమార్ మాట్లాడుతూ ధ్యానం తో ఆత్మ పరిశీలన అంతర్గత ప్రశాంతత చేకూరుస్తుంది అన్నారు. శారీరక ఆరోగ్య విషయంలో రక్త పోటు నియంత్రించడంతోపాటు నాణ్యతతో కూడిన నిద్ర కు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. హార్మోన్ల క్రియాశీలత అరికట్టి భావోద్వేగాల తరంగాలు మార్పు చేసి ప్రశాంతత, విశ్రాంతిని చేకూరుస్తుంది అన్నారు.
ప్రముఖ సైకాలజిస్ట్ యోగ శిక్షకులు బికే వెంకటరావు మాట్లాడుతూ ధ్యానం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ధ్యానాన్ని చేర్చుకోవాలన్నారు.
ప్రజా ప్రతి బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయం ప్రతినిధి రామేశ్వరీ మాట్లాడుతూ రాజయోగతో ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతంగా ఉండవచ్చునున్నారు. ధ్యానం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యమైన జీవనాన్ని గడిపేందుకు అవకాశం ఉందన్నారు. సర్వ మానవాళి మానసిక శారీరక ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అలవర్చుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి. డాక్ యార్డ్ సంఘం గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, యోగ శిక్షకులు సన్యాసిరావు, స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్, బ్రహ్మకుమారిల ప్రతినిధులు సోమేశ్వరి, అపరంజి తదితరులంతా పాల్గొని బ్రహ్మకుమారిస్ రూపొందించిన 2026 నూతన వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించారు..



