ప్రజా శ్రేయస్సు కై కలిసికట్టుగా పనిచేస్తాం..

సుద్దాల గ్రామ ప్రజలకు సురక్షిత శుద్ధ త్రాగు జలాలు అందించడమే ప్రధమ ధ్యేయం: సుద్దాల గ్రామ నూతన పాలకవర్గం.

ప్రజా శ్రేయస్సు కై కలిసికట్టుగా పనిచేస్తాం: సర్పంచ్ గడ్డమీది మహోదయ్ గౌడ్.

అన్ని వర్గాలకు అండగా ఉంటాం: ఉప సర్పంచ్ కాసం నాగేష్ గుప్తా.

సుద్దాల నూతన పాలకవర్గంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా సుద్దాల గ్రామంలో గత స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఇచ్చిన సూచించిన హామీల మేరకు గ్రామ ప్రజలకు ప్రధమంగా శుద్ధ త్రాగు జలాలను అందజేసే ఉద్దేశంతో గురువారం నూతన పాలకవర్గం అడుగు ముందుకేసింది. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా గ్రామ నూతన పాలకవర్గ సభ్యులు మరియు పుర ప్రముఖులు విద్యావంతుల పాల్గొని నూతన శుద్ధ త్రాగునీటిని అందించే దిశగా వాటర్ ఫిల్టర్ ను రిపేర్ చేపించి మునుపటి మాదిరిగానే 20 లీటర్లు రెండు రూపాయల చొప్పున గ్రామ ప్రజలకు అందించనున్నారు. ఈ యొక్క శుద్ధ జలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ నూతన పాలకవర్గం తెలియపరిచారు. సుద్దాల గ్రామ ప్రజలు నూతన వర్గంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో తాజా సర్పంచ్ గడ్డమీది మహోదయ్ గౌడ్ తాజా ఉప సర్పంచ్ కాసం నాగేష్, గుప్తా, వార్డు సభ్యులు బద్దుల రేణుక, శ్రీనివాస్,  సభ్యులు యామగాన్ని మైసయ్య గౌడ్, యామ గాని జయమ్మ, ఎల్లయ్య గౌడ్, కొండపల్లి మౌలాలి, గడుగు నరసింహ, ఏలే అనిత, శివాజీ,  గడ్డమీది వెంకటేష్, మబ్బు యాదగిరి, మరియు గ్రామ ప్రముఖులు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గడ్డమీద పాండారి గౌడ్,  మాజీ ఉపసర్పంచ్, బత్తిని రవి, ఏలా కృష్ణ, భక్తిని రాజు, గూడ రాజు, కుమారస్వామి, మోహన్ దశరథ, తోటకూరి బిక్షం, గడ్డమీద పరశురాములు గౌడ్, గూడ నరసింహులు, అండ్ మోహన్ రెడ్డి, పరంధాములు, వెంకటేష్ గౌడ్, పులకంటి నర్సిరెడ్డి తదితరులు పాల్గొని విజయవంతం చేసారు.