ఈనెల 27వ తేదీన ఉదయం 10:30 కి అమలాపురంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉపాధి కార్యాలయం వద్ద జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. ప్రముఖ సంస్థల్లో వివిధ ఉద్యోగాలకు ఎస్ఎస్సి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలకు 8978905032 ను సంప్రదించాలన్నారు.
