యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించిన కూటమి ప్రభుత్వం...హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ.
రాష్ట్రంలోని యువతకు బంగారు భవిష్యత్ అందించేందుకు నూతన సంవత్సర కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం పై రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ప్రకటన మాత్రమే కాదని, అది నిరుద్యోగులకు ఇచ్చే ఒక భరోసా అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇప్పటికే 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగిందన్నారు. వీటితో పాటు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో యువత భవిష్యత్ ను సర్వ నాశనం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ, ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ అన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేయటంతో ఉద్యోగాలు, ఉపాధి లేక వేలాదిమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు నాయుడు విధ్యార్ధి, యువతకు అన్ని విధాల అండగా నిలిస్తే జగన్ రెడ్డి మాత్రం తన అవినీతి, అరాచక పాలనతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసి యువత భవిష్యత్ ను ప్రశ్నార్ధకం చేశారని ఎమ్మెల్యే అన్నారు.

