అదనపు రద్దీ మరియు వేసవి రద్దీకు ప్రత్యేక రైళ్లు



ఏప్రిల్, మే మరియు జూన్ నెలల్లో ప్రయాణికుల అదనపు రద్దీకి, అలాగే వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని, భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించాయి.



విశాఖపట్నం – షాలిమార్ – విశాఖపట్నం వారాంత ప్రత్యేక రైళ్లు (08508/08507). రైలు సంఖ్య 08508 విశాఖపట్నం – షాలిమార్ వారాంత ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు 07.04.2026 నుండి 30.06.2026 వరకు ప్రతి మంగళవారం ఉదయం 11.20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. ఇది సింహాచలం (11.36/11.38), విజయనగరం (12.08/12.10), చిపురుపల్లి (12.35/12.37), శ్రీకాకుళం రోడ్ (13.08/13.10) స్టేషన్లలో ఆగి, మరుసటి రోజు ఉదయం 03.00 గంటలకు షాలిమార్ చేరుతుంది. (మొత్తం 03 ట్రిప్స్).

రైలు సంఖ్య 08507 షాలిమార్ – విశాఖపట్నం వారాంత ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ 08.04.2026 నుండి 01.07.2026 వరకు ప్రతి బుధవారం ఉదయం 05.00 గంటలకు బయలుదేరి, శ్రీకాకుళం రోడ్ (18.10/18.12), చిపురుపల్లి (18.38/18.40), విజయనగరం (19.03/19.05), సింహాచలం (19.35/19.37) స్టేషన్లలో ఆగి, రాత్రి 20.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. (మొత్తం 03 ట్రిప్స్).

ఆగే స్టేషన్లు: సింహాచలం, విజయనగరం, చిపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్-కేయోంజర్ రోడ్, భద్రక్, బాలసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగాచి.

Compostion: 2వ ఏసీ-1, 3వ ఏసీ-3, స్లీపర్-9, జనరల్ సెకండ్ క్లాస్-4, సెకండ్ క్లాస్ లగేజీ/దివ్యాంగజన కోచ్-1, మోటార్ కార్-1.

సoబల్‌పూర్ – ఈరోడ్ – సాంబల్‌పూర్ వారాంత ప్రత్యేక రైళ్లు (08311/08312). రైలు సంఖ్య 08311 సoబల్‌పూర్ – ఎరోడ్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ 01.04.2026 నుండి 27.05.2026 వరకు ప్రతి బుధవారం ఉదయం 11.35 గంటలకు బయలుదేరి, అదే రోజు దువ్వాడ (13.08/13.10) చేరి, గురువారం రాత్రి 23.15 గంటలకు ఈరోడ్ చేరుతుంది. (మొత్తం 09 ట్రిప్స్). 

రైలు సంఖ్య 08312 ఈరోడ్ – సoబల్‌పూర్ ప్రత్యేక రైలు 03.04.2026 నుండి 29.05.2026 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 14.35 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు దువ్వాడ (13.08/13.10) చేరి, శనివారం రాత్రి 23.15 గంటలకు సoబల్‌పూర్ చేరుతుంది. (మొత్తం 09 ట్రిప్స్). 

ఆగే స్టేషన్లు: బర్గఢ్ రోడ్, బాలంగిర్, టిట్లాఘఢ్, కేసింగా, మునిగూడ, సింగపురం రోడ్, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చిరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్, అరక్కోణం, కట్పాడి, జోలార్‌పెట్టై, సేలం.

Composition: 2వ ఏసీ-1, 3వ ఏసీ-3, స్లీపర్-9, జనరల్-4, లగేజీ/దివ్యాంగజన కోచ్-2, ప్యాంట్రీ కార్-1.

భువనేశ్వర్ – యశ్వంత్‌పూర్ – భువనేశ్వర్ వారాంత ప్రత్యేక రైళ్లు (02811/02812). రైలు సంఖ్య 02811 భువనేశ్వర్ – యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైలు 04.04.2026 నుండి 27.06.2026 వరకు ప్రతి శనివారం సాయంత్రం 19.15 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున దువ్వాడ (01.53/01.55) చేరి, అర్ధరాత్రి 00.15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుతుంది. (మొత్తం 13 ట్రిప్స్).

రైలు సంఖ్య 02812 యశ్వంత్‌పూర్ – భువనేశ్వర్ ప్రత్యేక రైలు 06.04.2026 నుండి 29.06.2026 వరకు ప్రతి సోమవారం ఉదయం 04.30 గంటలకు బయలుదేరి, దువ్వాడ (22.53/22.55) చేరి, మరుసటి రోజు ఉదయం 06.00 గంటలకు భువనేశ్వర్ చేరుతుంది. (మొత్తం 13 ట్రిప్స్). 

ఆగే స్టేషన్లు: ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, ధోనే, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, హిందూపూర్, యెలహంక.

Compostion: 3వ ఏసీ-16, జనరేటర్ కార్లు-2.

యశ్వంత్‌పూర్ – కటిహార్ – యశ్వంత్‌పూర్ వారాంత ప్రత్యేక రైళ్లు (06571/06572). రైలు సంఖ్య 06571 యశ్వంత్‌పూర్ – కటిహార్ ప్రత్యేక రైలు 07.04.2026 నుండి 14.07.2026 వరకు ప్రతి మంగళవారం ఉదయం 07.00 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు విజయనగరం (05.00/05.10) చేరి, గురువారం ఉదయం 04.30 గంటలకు కటిహార్ చేరుతుంది. (మొత్తం 15 ట్రిప్స్).

రైలు సంఖ్య 06572 కటిహార్ – యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైలు 10.04.2026 నుండి 17.07.2026 వరకు ప్రతి శుక్రవారం ఉదయం 05.15 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు విజయనగరం (03.40/03.50) చేరి, ఆదివారం ఉదయం 04.00 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుతుంది. (మొత్తం 15 ట్రిప్స్). 

మధ్యలో ఆగే స్టేషన్లు: యెలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గూటి, ధోనే, నంద్యాల, మార్కాపూర్ రోడ్, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలేశ్వర్, ఖరగ్‌పూర్, అందుల్, డంకుని, బోల్పూర్, రాంపూర్ హాట్, పాకూర్, మాల్దా టౌన్, సాంసి, కుమేద్‌పూర్.

Compostion: మొత్తం 20 కోచ్‌లు (2వ ఏసీ-1, 3వ ఏసీ-3, స్లీపర్-9, జనరల్-5, లగేజీ/దివ్యాంగజన-2). 

ఎస్‌ఎంవి బెంగళూరు – మాల్దా టౌన్ – ఎస్‌ఎంవి బెంగళూరు ప్రత్యేక రైళ్లు (06565/06566). రైలు సంఖ్య 06565 ఎస్‌ఎంవి బెంగళూరు – మాల్దా టౌన్ ప్రత్యేక రైలు 05.04.2026 నుండి 12.07.2026 వరకు ప్రతి ఆదివారం రాత్రి 23.40 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు దువ్వాడ (18.13/18.15) చేరి, మంగళవారం 16.30 గంటలకు మాల్దా టౌన్ చేరుతుంది. 

రైలు సంఖ్య 06566 మాల్దా టౌన్ – ఎస్‌ఎంవి బెంగళూరు ప్రత్యేక రైలు 08.04.2026 నుండి 15.07.2026 వరకు ప్రతి బుధవారం 16.00 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు దువ్వాడ (15.33/15.35) చేరి, శుక్రవారం 12.45 గంటలకు ఎస్‌ఎంవి బెంగళూరు చేరుతుంది. 

ఆగే స్టేషన్లు: దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్.

Composition: 2వ ఏసీ-1, 3వ ఏసీ-3, స్లీపర్-10, జనరల్-5, లగేజీ/దివ్యాంగజన-2. 

ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరడమైనది.