నూతన కమిటీని ఘనంగా సన్మానించిన కూటమి నాయకులు

హనవాలు విద్యా కమిటీ చైర్మన్‌గా ఖాజా, వైస్ చైర్మన్‌గా కళావతి ఎన్నిక

నూతన కమిటీని ఘనంగా సన్మానించిన కూటమి నాయకులు

​ఆదోని రూరల్ (హనవాలు): ఆదోని మండలం హనవాలు గ్రామ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ నాయకులు ఖాజా, వైస్ చైర్మన్‌గా జనసేన పార్టీ వీర మహిళ హరిజన కళావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.



​నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, వైస్ చైర్మన్‌లను జనసేన పార్టీ ఇన్‌చార్జి మల్లప్పన్న ఆదేశాల మేరకు జనసేన నాయకుడు ఎం. పులి రాజు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం స్థానికంగా అందుబాటులో లేని జనసేన ఇన్‌చార్జి మల్లప్పన్న వీడియో కాల్ ద్వారా నూతన కార్యవర్గంతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు, నాణ్యమైన విద్యనందించేందుకు కూటమి నాయకులు, కమిటీ సభ్యులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ కూటమి నాయకులకు కూడా ఆయన అభినందనలు తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పి.ఎస్. జయరాం, ఆర్. రాము, మంచాలే రాజు, నాగరాజు, జాలిమంచి వీరేష్, భారత్ తదితరులు పాల్గొన్నారు.