నంద్యాల జిల్లా: కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. సోమవారం తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరు కుంటున్నారు. ఆ మహా శివుడికి ఇష్టమైన పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక, జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తుల తాకిడి పెరిగింది. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ రోజుతో కార్తీకమాసం ముగుస్తుండటంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.శ్రీశైలంలో భక్తుల రద్దీ కారణంగా శ్రీ భ్రమ రాంబ మల్లికార్జు నస్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూ లైన్లు కూడా కిక్కిరిసి పోయి ఉన్నాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. ముందు రోజు అర్ధరాత్రి దాటిన తరువాతి నుండే ఇక్కడి పాతాళ గంగలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చు కుంటున్నారు....