డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేసిన బండి రామాంజనేయులు............

ఉపముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అటవీ పర్యావరణ గ్రామీణ రక్షిత మంచినీటి పథకం శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ కు బుధవారం విజయవాడలో క్యాంపు కార్యాలయం నందు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బండి రామాంజనేయులు మచిలీపట్నం జనసేన కార్యకర్త శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. 



గతంలో మచిలీపట్నంలో జరిగిన జన వాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ దృష్టికి గ్రామీణ వైద్యుల సమస్యలు వివరించడం జరిగింది, పవన్ కళ్యాణ్ స్పందించి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. హామీని నమ్మి పార్టీలో చేరి జనసేన కూటమి గెలుపుకు కృషి చేయడం జరిగింది. ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి ప్రజల క్షేమం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు సకాలంలో పెన్షన్లు సౌకర్యం పట్టణాలలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రాథమిక వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్న గ్రామీణ వైద్యుల ఇచ్చిన హామీని సంబంధిత శాఖ మంత్రులతో ముఖ్యమంత్రితో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి గ్రామీణ వైద్యులకు వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలని వృత్తి భద్రత సంక్షేమం ఉచిత ఇల్లు పథకం గ్రామీణ వైద్యులు కు పెన్షన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్రంలో ఉన్న గ్రామీణ వైద్యులు అందరి తరపున విన్నవించు చున్నానని ఒక ప్రకటనలో బండి రామాంజనేయులు తెలియజేశారు.