మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని



మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని, హైవే పై ప్రమాదంలో డ్రైవర్ ను రక్షించిన ఎమ్మెల్యే సిబ్బంది...



చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మానవత్వాన్ని చాటుకున్నారు. పాకాల నుంచి తిరుపతికి వస్తున్న ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన ముందు వెళుతున్న టమోటా ఏస్ వాహనం మామండూరు సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కిరణ్ కుమార్ వాహనంలో చిక్కుకున్నాడు. ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే తన వాహనాన్ని ఆపి సిబ్బంది సహాకారంతో  కిరణ్ కుమార్ ను బయటకు తీసుకువచ్చారు. గాయాలైన కిరణ్ కుమార్ ను తన వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలో హైవే పెట్రోలింగ్ వాహనం రావడంతో కిరణ్ కుమార్ ను హాస్పిటల్ కు తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని వైద్యులకు సూచించారు. జాతీయ రహదారిపై అత్యంత జాగ్రత్తగా ప్రయాణించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ప్రయాణికులకు ఆయన సూచించారు. వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు.