గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కోసం – చలో విజయవాడ కార్యక్రమానికి ఆహ్వానం
రాజకీయ పార్టీ అధ్యక్షులకు, రాష్ట్ర, జిల్లా నాయకులకు, రాజకీయ విశ్లేషకులకు, సామాజిక కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, మద్దతు దారులు కు, మిత్రులకు – అందరికీ ఇదే మా స్వాగతం... గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ...మిత్రులారా,
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికీ గ్రామీణ వైద్యుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించలేదు. 2024 ఎన్నికల సమయంలో కూటమి నాయకులు గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు ఆ సమస్యలపై కనీసం క్యాబినెట్‌లో కూడా చర్చ జరగలేదు. ఈ నేపథ్యంలో గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 16 నుండి 19 తేదీ వరకు (78 గంటలు) మౌన దీక్షను విజయవాడ గాంధీనగర్ లోని ధర్నా చౌక్ నందు నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డా. కొండి శెట్టి సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా “చలో విజయవాడ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.
ప్రభుత్వం గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు, మరియు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని, అయినప్పటికీ నేటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదనీ, ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము గట్టిగా కోరుచున్నామని అన్నారు. ఈ నెల 16 తేదీన నిర్వహించబడే చలో విజయవాడ కార్యక్రమానికి వందలాదిగా ప్రజలు హాజరవ్వాలని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
ఫిబ్రవరి 16 తేదీ ఉదయం 10.00 గంటలకు ధర్నా చౌక్ లో కార్యక్రమం ప్రారంభమవుతుందనీ, ఈ కార్యక్రమం విజయవంతం కావతానికి అనుభవజ్ఞులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కొండి శెట్టి సురేష్ బాబు మీడియాకు తెలిపారు.
కొండి శెట్టి సురేష్ బాబు – విజయవాడ – 9885395366
బి.ఆర్. ఆంజనేయులు,
సయ్యద్ మౌలాలి,
ఆర్.ఎస్. నాయుడు,
పసుపులేటి శ్రీనివాస్,
సత్తార్ రాజ్ శేఖర్.
