విజయవాడ: విజయవాడ రైల్వే మెయిల్ సర్వీస్ అద్వర్యంలో గొల్లపూడి పార్సెల్ హబ్ నందు బల్క్ పార్సెల్ బుకింగ్ గత సంవత్సరం ఆగష్టు నెలలో ప్రారంభించడమైనది. విజయవాడ, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల లోని బల్క్ కస్టమర్స్ తమ పార్సెల్స్ ను బుకింగ్ కొరకు ఇచ్చటి సేవలు వినియోగించుకొనుట జరిగింది.
ఈ సేవలను మరింత విస్తృత పరుచుటకొరకు ఈరోజు ఒక గెజిట్ ఆఫీసర్ మరియు ఇద్దరు మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్ లను నియమించి గొల్లపూడి పార్సెల్ హబ్ నందు ఒక పార్సెల్ మార్కెటింగ్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. ఇచ్చట బుక్ అయిన పార్సెల్ అదే రోజు గొల్లపూడి పార్సెల్ హబ్ నందు ప్రాసెస్ చేసి త్వరిత గతిన దేశంలోని అన్ని ప్రాంతాలకు నేరుగా చేర్చబడును.
హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, రాజమండ్రి, ఒంగోలు మరియు గుంటూరు లాంటి ప్రాంతాలకు మరుసటి రోజునే చేర్చబడును. బల్క్ కస్టమర్స్ ముఖ్యంగా బుక్ పబ్లిషర్స్ వారి పార్సెల్ బుకింగ్ కొరకు ఈ క్రింది ఆఫీసర్స్ మరియు మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్ లను సంప్రదించగలరు.
1 శ్రీ ఏ ప్రవీణ్ కుమార్, మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్ (8247365620)
2 శ్రీ ఈ వెంకటరావు, మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్ (9505932394)
3 శ్రీ ఎల్ దేవానంద్, ఆసిస్టెంట్ సూపరింటేడెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ (9441283651)
4 శ్రీ Md లుతీఫ్ అలీ, జాయింట్ మేనేజర్, గొల్లపూడి (9963395524)
ఇట్లు
జి వి బాల సరస్వతి
సూపరింటెండెంట్
రైల్వే మెయిల్ సర్వీస్
ఆర్ ఎం ఎస్ వై డివిజన్
విజయవాడ