ఆదివాసీ స్పెషల్ డి ఎస్సీ త్వరలో నిర్వహిస్తాం గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ..!!

జీఓ నెంబర్ 3 రిజర్వేషన్ పునరుద్దరణకు చర్యలు తీసుకుంటాం



ఏజెన్సీ నిరుద్యోగులతో స్పెషల్ డి ఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కి ఆర్డినెన్సు తీసుకురావాకానీ ఆదివాసీ గిరిజన సంఘం విజ్ఞప్తి.

 ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రతిపాదనపై గిరిజన  మంత్రి గుమ్మడి సంధ్య రాణి  సానుకూలంగా స్పందన

 

ఆదివాసీ స్పెషల్ డి ఎస్సీ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుద్యోగులకు టీచర్స్ పోస్టులు భర్తీ చేయడానికి తక్షణమే ఆర్డినెన్సు తీసుకురావాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రతినిధి బృందం రాష్ట్ర గిరిజన మంత్రి గుమ్మడి సంధ్య రాణి  సాలూరు లో వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రతినిధి బృందం ప్రతిపాదనపై మంత్రి  పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులుభర్తీకి మొట్టమొదటి సంతకం చేయడాన్ని హర్షిస్తున్నాము. 2024 డిశంబర్ 31 నాటికి నియాకపు ప్రక్రియ పూర్తిచేయాలని విద్యాశాఖకుఆదేశించారు. కాని 5వ షెడ్యూల్డ్ ఏరియాలో 100 శాతం రిజర్వేషన్ అమలుపై స్పష్టత ఇవ్వలేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుచేయడం వల్ల ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. తమ ప్రభుత్వం పునర్ పరిశీలన చేయాలని ఆదివాసీ గిరిజనసంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో 100% శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తున్న జీఓ నెంబర్ 3 ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై 2020లోరాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి మొత్తం 17 రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలై ఉన్నది. మరోపక్కఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు ఉద్యోగ రిజర్వేషన్కు గత రాష్ట్ర ప్రభుత్వం 5వ షెడ్యూల్డ్ క్లాజ్ (2) ప్రకారం చట్టబద్ధత కల్పిస్తామని ట్రైబల్అడ్వైజర్ కౌన్సిల్(టిఏసి) లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంక్షేమశాఖ సిఫార్సు చేసింది. టి.ఏ.సి తీర్మానాన్ని కూడా గతరాష్ట్ర ప్రభుత్వం కనీసం గౌరవించలేదు. మరోపక్క జనరల్ డిఎస్సీ నోటిఫికేషన్తో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్రమైన ఆభద్రత భావం,ఆందోళన కలిగిస్తోంది. జీ.ఓ నెంబర్ 3 రద్దు చేసిన తర్వాత అనేకమార్లు తమ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. కానీ ఏనాడుఆదివాసులకు 100% శాతం ఉద్యోగ రిజర్వేషన్ కు చట్టబద్ధత గూర్చి ప్రస్తావన చేయలేదు. పునరుద్ధరణకు కనీసం ఎటువంటిచర్యలకు ఉపక్రమించకపోవడంతో ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ఏరియాలో ఆదివాసులకు భద్రత, రక్షణ, పరిపాలన బాధ్యత కోసం స్పష్టంగా పేర్కొనబడినది.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఏ ఉత్తర్వులైనా 5వ షెడ్యూల్ క్లాజ్ (1)(2) ప్రకారం గవర్నర్, టి.ఏ.సి అనుమతి తప్పకుండా తీసుకోవాలి.రాజ్యాంగ స్ఫూర్తిని తమ ప్రభుత్వం కాపాడాలి. ఆదివాసులకు ప్రత్యేక భాష సంస్కృతి ఉంది. గిరిజన భాష రాని ఉపాధ్యాయులను ఏజెన్సీలో నియమించడం వల్ల ఆర్టికల్29, 32 ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇటీవల కాలం లో 1998, 2008లో సుమారు 400 + 280 ఎస్సీటీ పోస్టులను పాడేరు ఏజెన్సీప్రాంతంలో మినిమం టైమ్స్ స్కేల్ ప్రాతిపదికన స్థానికేతరులతో తమ ప్రభుత్వం భర్తీ చేయడం వల్ల ఆదివాసీలు ఉద్యోగం పొందుతామనేఆశ, నమ్మకం కోల్పోయి ఆసాంఘిక కార్యకలాపాలవైపు మొగ్గుచూపుతున్నారు. 1/70 చట్టం ప్రకారం స్థిర నివాసానికి అనుమతులు లేని వారు 2% శాతం మాత్రమే ఉన్న గిరిజనేతరులకు 95% పోస్టులుభర్తీ చేయడం, 98 శాతం మంది వున్న ఆదివాసుల కోసం కేవలం 5 శాతం పోస్టులు మాత్రమే కేటాయించి భర్తీ చేయడం తగదనితగదు. తమ ప్రభుత్వం వెంటనే జనరల్ డిఎస్సీ నోటిఫికేషనన్ను పునర్ పరిశీలించి ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగులకు భద్రతా,భరోసా కల్పించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి తగిన చర్యలు తీసుకొవాలని ఆదివాసీ గిరిజన సంఘం కోరుతుంది. ఎన్నికల ప్రచారం లో జీఓ నెంబర్ 3 రిజర్వేషన్ పునరుద్దరణ చేస్తామని ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అరకు లో హామీ ఇచ్చారని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రతినిధి బృందం గిరిజన సంక్షేమ మంత్రి కి గుర్తు చేశారు.గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కు ఏ. ఎన్.ఎం నియమించాలి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల లో గిరిజన విద్యార్థుల మరణాలు నివారణకు తక్షణమే ఆశ్రమ పాఠశాల లో ఏ. ఎన్.ఎం ను నియమించాలని మంత్రి విజ్ఞప్తి చేశాం. మంత్రి స్పందిస్తూ ఆశ్రమ పాఠశాలలో ఏ. ఎన్.ఎం నియామక ప్రక్రియ కు ఉత్తర్వులు త్వరలో జారీ చేస్తామని అన్నారు. ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటరీ లను రెన్యువల్ చేయాలని మంత్రి  కోరడం జరిగింది. సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతినిధి బృందం లో ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి అప్పల నరస, రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి కిల్లో సురేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు పొద్దు బాల్ దేవ్, జిల్లా గౌరవ అధ్యక్షులు సిదరపు అప్పారావు, ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటరీ సంఘం రాష్ట్ర నాయకులు మర్రి చిట్టి బాబు వెంకటేష్, ఆనంద్, తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.