మానవీయ విలువల మహనీయ చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆశయాలు ఆలోచనలు వర్ధిల్లాలి.
భారత దేశం అఖండ భారత్ కావాలంటే ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆశయాలు ఆలోచనలు ఆచరణాత్మక రూపంలో వెల్లి విరియాలని అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ పిలుపు నిచ్చారు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్బoగా మాట్లాడుతూ నిబంధనలు కఠినంగా అమలులో ఉన్నకాలంలో శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం చేపట్టారని జ్ఞాని అయ్యారని సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించారని అంటరాని కులాల వారికి ఆయుధమిచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దారని, ముస్లింల పట్ల, వారి మతం పట్ల శివాజీ ఎప్పుడూ ద్వేష భావం చూపలేదని చరిత్రకారుడు సర్దేశాయి 'న్యూ హిస్టరీ ఆఫ్ మరాఠాస్' అనే తన పుస్తకంలో రాశారు.అని సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమే శివాజీ ప్రాథమిక లక్ష్యంగా జీవితాంతం పోరాడారని, మతం ప్రాతిపదికన కాకుండా మానవీయ కోణంలో ఛత్రపతి శివాజీ పరిపాలన సాగించారని సైన్యంలో, ఇతర అధికారుల నియామకాల్లో మతానికి ఏ మాత్రం ప్రాముఖ్యం ఇవ్వలేదని.శివాజీ సైన్యంలో ముస్లిం సామాజిక వర్గాన్ని రాజ్యాన్ని రక్షించాల్సిన సైన్యంలో ఆయన నిర్భయంగా ముస్లింలను నియమించుకోవడం, వారి మీద నమ్మకం పెంచుకోవడం గమనించాల్సిన విషయంఅన్నారు అలాగే ఇతర మత పెద్దలను కూడా శివాజీ ఎంతో గౌరవించేవారని హజ్రత్‌బాబా యాకుబ్ తొర్వాలే పట్ల శివాజీకి ఎంతో గౌరవభావం వుండేది. జీవితాంతం ఆయనకు పింఛను అందేలా ఏర్పాటు చేశారు. ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు తన రాజధాని రాయగఢ్‌లో ప్రత్యేకంగా మసీదు నిర్మించారు రాజ్యంలోని, మసీదులకు, దర్గాలకు రక్షణ కల్పించారు ఎవరికైనా ఖురాన్ దొరికితే దాన్ని గౌరవంగా తీసుకెళ్లి ముస్లింలకు అప్పగించాలన్న ఉత్తర్వు అమలులో ఉండేది. అలాగే ఫాదర్ అంబోస్ పట్ల కూడా శివాజీకి ఎంతో గౌరవం వుండేది. గుజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చి పునర్నిర్మించడానికి భూరి విరాళం అందించారు.
యుద్ధ సమయంలో చేతికి చిక్కిన ఇతర మతాల మహిళల పట్ల, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించరాదని సైన్యానికి ఆదేశాలుండేవి. ఆదిల్షా రాజులకు శివాజీకి ఏళ్ల తరబడి యుద్ధం సాగుతున్న తరుణంలో, ఆదిల్షా రాజ్యానికి ప్రతినిధిగా అఫ్జల్ ఖాన్ పోరాడాడు. చర్చల పేరుతో శివాజీని తన గుడారానికి ఆహ్వానించి చంపడానికి కుట్ర పన్నాడు. అయితే ఆ కుట్ర వివరాలు ఒక ముస్లిం ద్వారా శివాజీ తెలుసుకున్నాడు. అంటే హిందువయిన శివాజీ మహారాజును రక్షించుకున్నది ముస్లిం అయిన రుస్తుం జమాన్. రుస్తుం జమాన్. సూచన మేరకే శివాజీ బాగ్ నక్ పులి పంజాలు ధరించి అఫ్జల్‌ఖాన్‌ను చంపేశాడు. ప్రజారంజకుడైన మహారాజు ఛత్రపతి శివాజీ నిబంధనలు కఠినంగా అమలులో ఉన్న ఆ కాలంలో శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం చేపట్టాడు. జ్ఞాని అయ్యాడు. సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడు. అంటరాని కులాల వారికి ఆయుధమిచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడు. 'బుద్ధ భూషణం' అనే పుస్తకం రాశాడు. . శూద్ర కులాల్ని చైతన్యపరిచాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ : వర్ణవ్యవస్థను ప్రశ్నించిన ప్రజాపాలకుడు ఆయన మంత్రివర్గంలో హిందువులు, ముస్లింలు, వివిధ సామాజిక వర్గాలవారు ఉన్నారు. సైన్యంలో ముస్లిం అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. మసీదులు, మతస్థలాలను రక్షించాలనే ఆదేశాలు ఆయన సైనిక నియమావళిలో భాగంగా ఉన్నాయి. ఇది ఆయన పాలన మతాధారితమైనది కాదని, ప్రజల సంక్షేమాన్ని కేంద్రంగా పెట్టుకున్న లౌకిక పాలన అని స్పష్టంగా తెలియజేస్తుంది మదారీ మెహతార్, సిద్ధిహిలాల్ వంటి ముస్లిం వ్యక్తులను తన అంగరక్షకులుగా నియమించుకున్నారు ఛత్రపతి శివాజీ ఆయుధ భాండాగార అధిపతిగా ఇబ్రహీం ఖాన్‌ను, సర్వసైన్యాధ్యక్షుడిగా దౌలత్ ఖాన్‌ను నియమించడమే కాకుండా, విదేశీ వ్యవహారాల బాధ్యతలను కూడా హైదర్ వంటి ముస్లింలకు అప్పగించారు. రాజ్యపాలనలోనూ, యుద్ధనీతిలోనూ శివాజీ మహారాజ్ సాధించిన అనేక గొప్ప విజయాల్లో ఈ ముస్లిం అధికారులు కీలక పాత్ర పోషించారు. శివాజీ సైన్యంలో సుమారు 30 శాతం ముస్లింలు ఉన్నారు.ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆశయాలు ఆలోచనలతోనే భారత దేశాన్ని అఖండ భారత్ గా సాధించగలమఅఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ పిలుపు నిచ్చారు
