నిజమైన రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపండి: కేంద్ర ప్రభుత్వానికి SKM విజ్ఞప్తి.
కేంద్ర బడ్జెట్, 2024-25, ప్రక్రియలో ఆలోచనలు, సూచనలను అభ్యర్థించడానికి వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి వ్యక్తిగతంగా ముందస్తు బడ్జెట్ సంప్రదింపులు జరుపుతారని మా దృష్టికి వచ్చింది. జూన్ 21, 2024న రైతు సంఘాలు & వ్యవసాయ ఆర్థికవేత్తలతో సమావేశం జరగనుంది. తీవ్ర వ్యవసాయ సంక్షోభం పరిష్కారానికి ప్రతిపాదనలతో కూడిన వ్యవసాయ సమస్యలపై సంయుక్త కిసాన్ మోర్చా మెమోరాండాను సమర్పించింది. రైతాంగం యొక్క అతిపెద్ద సంఘాలను కాకుండా బిజెపి ప్రభుత్వ అనుకూల అనమతు రైతు సంఘాలను ఆహ్వానించింది. రబీ, ఖరీఫ్ సీజన్‌లో కనీస మద్దతు ధరలను నిర్ణయించడానికి వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ ముందు మా ప్రతిపాదనలను ఉంచడానికి నిజమైన రైతు సంఘాలను ఆహ్వానించలేదు. అయితే, ఈ సందర్భంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం, ఆర్థిక మంత్రి సమావేశానికి సంయుక్త కిసాన్ మోర్చా(skm) నాయకత్వాన్ని గాన్ని లేదా రైతు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిజమైన రైతుల ప్రతినిధులను పక్కన పెట్టడం, ప్రహసన కసరత్తుకు పాల్పడుతోందని ఈ విధానం ద్వారా స్పష్టమవుతోంది. ఎస్ కెయం ఈ విధానాన్ని ఖండిస్తూ ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంతో మాట్లాడాలని డిమాండ్ చేస్తోంది. వారు తమ అహంకారాన్ని విడిచిపెట్టి, ఇటీవల ముగిసిన ఎన్నికలలో 159 నియోజకవర్గాలలో నిర్ణయాత్మక తిరుగుబాటు నుండి గుణపాఠాలు నేర్చుకుని, విశాల హృదయంతో చర్చలకు ఆహ్వానించాలి . అటువంటి చర్య లేనట్లయితే, అతి త్వరలో దేశవ్యాప్తంగా రైతుల భారీ చైతన్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.
ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి
కన్వీనర్
వడ్డే శోభనాధీశ్వరరావు
రాష్ట్ర రైతు సంఘాల నాయకులు
వై కేశవరావు
కే వి వి ప్రసాదరావు
డి. హరినాథ్
సింహాద్రి ఝాన్సీ
కొల్ల రాజమోహన్
ఎం. వెంకటరెడ్డి
మరీదు ప్రసాద్ బాబు