కార్మిక సంక్షేమం సంగం బలోపేతానికి ఉపాధ్యక్షుడు గుత్తుల మధు కృషి

బీఎంఎస్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక కార్మిక హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రతా పథకాల విస్తరణ, కార్మిక సంక్షేమం సంగం బలోపేతానికి ఉపాధ్యక్షుడు గుత్తుల మధు కృషి చేస్తానని పేర్కొన్నారు.

మహాసభలో ప్రసంగిస్తున్న బీఎంఎస్ నాయకులు

భారతీయ మజ్దార్ సంఘ్ (బీఎంఎస్) జిల్లా నూతన కమిటీని ఆదివారం జరిగిన జిల్లా మహాసభలో కార్మిక హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రతా పథకాల విస్తరణ, కార్మిక సంక్షేమం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. రొక్కం సురేష్కుమార్ జిల్లా అధ్యక్షునిగా, చింతాడ రమణ, వినోద్, టి. భూలోక నాయుడు, గుత్తల మధుబాబులు ఉపాధ్యక్షులుగా, మీడియా ఇన్చార్జిగా రాందాస్ గోవింద ఎన్నికయ్యారు. ఎం.అనీల్కుమార్ కార్యదర్శిగా, గౌరీశ్వరరావు కోశాధికారిగా, సుజిత్ శర్మ. ఎస్.నాగ అప్పారావు, వై. కొండలరావు, కె.వి.ఎన్. సత్యవతిలను సంయుక్త కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక హక్కుల సాధన, సంఘం బలోపేతం, కార్మిక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్తామని నూతన కమిటీ పేర్కొంది. కార్యక్రమంలో బి ఎం ఎస్ కమిటీ సభ్యులు ప్రతినిధులు పాల్గొన్నారు.