అరకు వ్యాలీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘనంగా జన్మదిన వేడుకలు!!!
దేశ ప్రజల కోసం రాజ్యాంగం పరిరక్షణ కోసం పోరాడుతున్న ఒక గొప్ప మహా వ్యక్తి గౌరవ శ్రీ రాహుల్ గాంధీ: శ్రీమతి పాచిపెంట శాంత కుమారి, ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర చైర్ పర్సన్.
అరకు వ్యాలీ నియోజకవర్గము, అరకు వ్యాలీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర చైర్ పర్సన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మనవడు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత గౌరవ రాహుల్ గాంధీ గారికి అరకు వ్యాలీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి న్యూఢిల్లీలో ఉన్న గౌరవరాహుల్ గాంధీ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు 55వ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసుకుని నాయకులు ఒకరినొకరు పంచుకొని తిని సంబరాలు చేసుకుని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా, శ్రీమతి శాంత కుమారి మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని దేవునికి ప్రార్థిస్తూ భారత దేశ బావి ప్రధాన మంత్రిగా భవిష్యత్తులో ఎన్నికవుతారు అని ప్రస్తుత పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా భారత దేశ ప్రజలకు బడుగు బలహీన వర్గాల వారికి కార్మికులు కర్షకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని అదేవిధంగా భారతదేశ రాజ్యాంగము సంపూర్ణంగా అమలు కొరకు దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా పోరాటం చేస్తున్న మహా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ చట్టారి సాయిబాబా. పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి, డుంబ్రిగూడ మండల ఆదివాసి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కిల్లో జగనాదం, మండల అధ్యక్షులు పాంగి గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోర్ర పోతురాజు, శెట్టి భగత్ రాం, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు గొల్లూరి పద్మ, అల్లూరి సీతారామరాజు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గంపరాయి భానుచందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.