ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ విశాఖపట్నం వారి ప్రతిజ్ఞ



ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ విశాఖపట్నం: శివరాత్రి మహా దినం పురస్కరించుకొని శివరాత్రి జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించే వారి కోసం తేది. 14.02.2026 అర్ధరాత్రి నుండి 15.02.2026 సాయంత్రం వరకు గాజువాక, కుర్మన్నపాలెం మరియు అగనంపూడి ప్రాంతాల నుండి అప్పికొండకు 94 ప్రత్యేక బస్సులు నడపబడునని, తగరపువలస, భీమిలి, ఆరిలోవ కాలనీ, రవీంద్ర నగర్, పెందుర్తి, కొత్తవలస, సింహాచలం, గాజువాక, కూర్మన్నపాలెం నుండి ఆర్.కె.బీచ్ నకు 110 బస్సులను నడపనున్నట్లు, విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలియజేశారు. 



ప్రయాణీకుల రద్దీ బట్టి అధికారుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు బస్సులు ఏర్పాటు చేశారని, విశాఖపట్నం లోని వివిధ ప్రాంతాలనుండి మత్స్యగుండం నకు 15 బస్సులు మరియు కళ్యాణపులోవ కు 5 ప్రత్యేక బస్సులు నడుపబడునని కావున భక్తులు మరియు ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరచుకొని, పరమశివుని అనుగ్రహం పొందాలని కోరుకున్నారు.



ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని, బస్సులను తప్పని సరిగా బస్సు స్టాప్ లలో ఆపి ప్రయాణీకులను అనుమతించేందుకు గాను మరియు మహిళలపట్ల గౌరవంతో వ్యవహరించేవిధంగా సిబ్బందికి ఎప్పటికప్పుడు తగు మార్గదర్శకాలు ఇవ్వాలని, జీరో బ్రేక్ డౌన్స్ సాధించాలని, పొల్యూషన్ కంట్రోల్ చేసేవిధంగా బస్సుల నిర్వహణ చేపట్టాలని, జీరో కంప్లైంట్స్ తో ముందుకు వెళ్లాలని  ఈ రోజు జిల్లా ప్రజా రవాణా అధికారి వారి కార్యాలయంలో



 జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పల నాయుడు, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ శ్రీ ఏ. గంగాధర రావు, అన్ని డిపో ల మేనేజర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ కె. గంగాధర రావు, పర్సనల్ ఆఫీసర్ జె. తిరుపతి, అకౌంట్స్ ఆఫీసర్ కుమారి వి. వంశీ మోహిని మొదలగు వారితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి, ప్రతిజ్ఞ చేశారు.