జై మహాభారత పార్టీ నాయకులు బొంకు అర్జున్ రావు కు అస్వస్థత,ఆసుపత్రిలో చేరిక.



అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గం జై మహాభారత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొంకు అర్జున్ రావు  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. ఈరోజు పాడేరు నుండి కొయ్యూరు మండలంలో తమ స్వగ్రామమైన వరదరాలకు బయలుదేరి ఇంటికి చేరుకున్న కొద్దిసేపట్లోనే బొంకు అర్జున్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 



ఈ నేపథ్యంలో అతనిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు  మంగళవారం బొంకు అర్జున్ రావు కుమార్తె పుట్టినరోజు వేడుకలు కుటుంబ సమేతంగా గ్రామస్తులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆయన వచ్చారని ఈ తరుణంలోనే అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు బాధను వ్యక్తపరిచారు.