అగనంపూడి మసీదులో ఘనంగా జరిగిన బక్రీద్ మహోత్సవాలు



అగనంపూడి పునరావస కాలనీ పెదమడక మసీద్ ఈ అబూబకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బక్రీద్ ఉత్సవాల్లో ముస్లిం సోదరులందరూ ఒకరిని ఒకరు అలింగం చేసుకొని ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ జీవీఎంసీ 85 వార్డు టిడిపి ఇంచార్జ్ గంతకోరు అప్పారావు ముస్లిం సోదరులందరికీ స్వీట్స్ పంపిణీ చేసి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ త్యాగానికి ప్రతిక బక్రీద్ ప్రవక్తల జీవితాలు. వారు అనుసరించిన విధానాలను ఆదర్శంగా తీసుకొని, అనుసరించి చేడు మార్గాలకు దూరంగా, మంచి శాంతి మార్గాల్లో నడవాలి, సేవా గుణం కలిగి ఉండాలి,మనిషికి దైవభూతికి త్యాగాలకు స్ఫూర్తి కలిగి ఉండాలి ఉండాలి అన్నారు. 



గంతకోరు అప్పారావు మాట్లాడుతూ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గెలుపుకు స్థానిక ముస్లింలంతా ఎంతో ఐక్యతగా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక ముస్లింలు అపరస్కృత సమస్యలను పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మసీద్ కమిటీ అధ్యక్షులు భాషా భాయ్ సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టిడిపి నాయకులు వంకర రాము, డాక్టర్ కేజే నాయుడు, మసీద్ కమిటీ ప్రతినిధులు అబ్దుల్ రహిమాన్, ఎండి పీరుఓల్లి, అబ్దుల్ రహమాన్, షేక్ సిలారి, షేక్ హుస్సేన్, ఎస్ కే చిన్న, సలీం ,అబ్బో దియా, హుస్సేన్, ఎస్.కె సమూద్దిన్, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.