జూలై 9 దేశవ్యాప్త సమ్మెను బలపర్చాలని కార్మికవర్గానికి 11 సంఘాల పిలుపు
బ్రిటీష్ కాలం నుంచి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మార్చి కేంద్ర బిజెపి ప్రభుత్వం 4 లేబర్ కోడ్‌లు తెచ్చింది. కార్మికుల ప్రాధిమిక హక్కులైన సంఘం పెట్టడం, సమ్మెలు చేయడంతో సహా అనేక హక్కులు కోల్పోతున్నారు. రోజుకు 8 గంటల బదులు 12 గంటలు చేయాలని లేబర్ కోడ్‌లు చెబుతున్నాయి. కార్మికవర్గం సమ్మె చేస్తే ఒకరోజు సమ్మెకు 8రోజుల జీతం కట్‌అవుతున్నది. కార్మిక నాయకులను జైల్లో పెట్టవచ్చు. పోరాటాలే చేయకుండా అణిచివేసి యాజమాన్యాలకు అత్యధిక లాభాలు తెచ్చి పెట్టడానికి లేబర్ కోడ్ల్ వచ్చాయి. లేబర్ కోడ్ల్ రద్దుచేయాలని 2025 జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నది. యావత్ కార్మికవర్గం సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం.
లేబర్ కోడ్ల్ వల్ల తనిఖీలు ఎత్తివేశారు. గతంలో ఒక కార్మికుడు గాని, యూనియన్ గాని ఫిర్యాదు చేస్తే వెంటనే ఫ్యాక్టరీ అధికారులు తనిఖీలు చేసేవారు. ప్రమాదాలు నివారించేవారు. కానీ నేడు ఇన్స్‌పెక్షన్స్ పూర్తిగా ఆగిపోయాయి. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రావిడెంట్ ఫండ్, ఇఎస్‌ఐ, బోనస్, కనీసవేతనాలు అమలు గురించి కూడా తనిఖీలు లేకపోవడంతో ఏ ఒక్క చట్టం అమలు కావడం లేదు. గతంలో ఉన్న ఇన్స్‌పెక్షన్‌లో ఉన్న పద్దతి అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది.
బిఎంఎస్ రెండు లేబర్ కోడ్ల్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్ల్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వేతనాల కోడ్‌లో కనీసవేతనం రోజుకు రూ॥178/`లుగా నిర్ణయించింది. దేశంలో ఎక్కడైనా ఇంత తక్కువ వేతనం అమలులో ఉందా?. బిఎంఎస్ లేబర్ కోడ్ల్ సమర్ధిస్తూ జూలై 9 కార్మిక సమ్మెను వ్యతిరేకించడం కార్మికవర్గానికి ద్రోహం చేయడమే. విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ విధానాలను బిఎంఎస్ సమర్ధించడం సిగ్గుచేటు. విశాఖ స్టీల్‌ను ప్రైవేట్‌కు అప్పగించి కార్మికవర్గాన్ని బాగా తగ్గించి రోబోట్స్ మరియు ఆటో మిషన్ పద్దతిలో విశాఖ స్టీల్‌ను నడపాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. దీనిని బిఎంఎస్ నాయకత్వం సమర్ధించడం విశాఖ స్టీల్‌కు ద్రోహం చేయడమే. బిఎంఎస్ ట్రేడ్ యూనియన్‌గా మాట్లాడే నైతిక హక్కులేదు. కార్మికవర్గం యావత్ జూలై 9 సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాము.
(సి.హెచ్.నరసింగరావు)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
(కె.ఎం.శ్రీనివాస్)
అధ్యక్షులు, విశాఖ జిల్లా
(బి.జగన్)
కార్యదర్శి, విశాఖ జిల్లా