పేద కుటుంబానికి వాసుపల్లి రూ.5000 ఆర్థిక సాయం

పేద కుటుంబానికి వాసుపల్లి రూ.5000 ఆర్థిక సాయం.... దక్షిణ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే నిస్వార్ధ సేవలు....



దక్షిణ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి, గణేష్ కుమార్ నిస్వార్థ సేవలో నిరంతర ఆర్థిక సాయం చేస్తుండడం ఆదర్శంగా నిలుస్తున్నాయి. శనివారం ఉదయం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఓ పేద ఇంటికి వెళ్లిన వాసుపల్లికి వారి కష్టాలు చూసి చలించి తన సొంత నిధులతో ఆడారి వెంకటలక్ష్మికి 5000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కరెంటు చార్జీలు పెంచమని చెప్పి బిల్లులు మోత మోగించడమే కాక ఆ పేరుతో పథకాలు తొలగించడం పట్ల పేదలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. మళ్లీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అమర్చి స్మార్ట్ గా ప్రజల నుండి వసూలు చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని దీనిని ప్రజలు వ్యతిరేకించాలని వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్,33 వ వార్డు ప్రెసిడెంట్ ముత్తాబత్తుల రమేష్, 33వ వార్డు ఎక్స్ కార్పొరేటర్ పచ్చి పిల్లి రాము, సౌత్ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు వాసాల సుబ్రమణ్యం (సువార్త రాజు), ఆకులు శ్యామ్, సూర్య నాయుడు, అరుగుల రాజు,రామరాజు తదితరులు పాల్గొన్నారు.