శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో జరుగుతున్న శ్రీ కామాక్షి దేవి సమ్మెత శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణo అనంతరం జరిగే తీర్థవాది సముద్ర స్నానాలు ఘనంగా జరిగాయి.
భక్తులతో సముద్ర తీర ప్రాంతం కిక్కిరిసిపోయింది. భక్తులు అమావాస్య కావడంతో అత్యధికంగా సముద్ర స్నానం చేయడానికి పోటెత్తి వచ్చారు. వచ్చిన భక్తులకు గ్రీన్ ఫీల్డ్ అధినేత ఓజిలి కృష్ణారెడ్డి అన్నదానం ప్రసాదాలు అందజేశారు.
ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని దేవుని సన్నిధికి వచ్చినవారు ఆకలితో వెళ్లకూడదని వచ్చిన భక్తులందరికీ అన్నదానం తో పాటు ప్రసాదాలు అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.