విజయవంతంగా ముగిసిన బాంబు తనిఖీ

ఎన్టీపీసీలో విజయవంతంగా ముగిసిన బాంబు తనిఖీ ‘మాక్ డ్రిల్’ (Mock Drill)



అనకాపల్లి (పరవాడ), డిసెంబర్ 31:జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, పరవాడలోని ఎన్టీపీసీ (NTPC) ప్రాంగణంలో బుధవారం బాంబు ముప్పును ఎదుర్కొనే సన్నద్ధతపై ‘మాక్ డ్రిల్’ నిర్వహించారు.



ఎన్టిపిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ శర్మ, సిఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రాజ్ కుమార్, పరవాడ ఇన్‌స్పెక్టర్ ఆర్.మల్లికార్జున రావు నేతృత్వంలో, జిల్లా బాంబు డిస్పోజల్ (BD) టీం మరియు డాగ్ స్క్వాడ్ ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.



స్థానిక పరవాడ పోలీసు సిబ్బంది, సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలు మరియు ఎన్టీపీసీ భద్రతా విభాగం అధికారులు అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నారు.



మాక్ డ్రిల్‌లో భాగంగా గుర్తించిన నమూనా బాంబు పరికరాన్ని భద్రతా బృందాలు చాకచక్యంగా గుర్తించి, సురక్షితంగా నిర్వీర్యం చేశాయి.



అత్యవసర పరిస్థితుల్లో భద్రతా దళాల స్పందన సామర్థ్యాన్ని పరీక్షించడానికి మరియు ప్రజల రక్షణను నిర్ధారించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.



ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అత్యంత క్రమశిక్షణతో సాగిన ఈ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారని ఈ సందర్భంగా పోలీసులు భరోసా ఇచ్చారు.