పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ తో కూడిన సమగ్ర చట్టం చేయాలి

ముఠా కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ తో కూడిన సమగ్ర చట్టం చేయాలి. Citu.



విశాఖ జిల్లాలో వివిధ షాపులలోను గోడౌన్స్ లోను పనిచేస్తున్న ముఠా కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ తో కూడిన సమగ్ర చట్టం చేయాలని విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈరోజు జగదాంబ సిఐటియు ఆఫీసులో విశాఖ జిల్లా ముఠావర్కర్ సీనియర్ 10వ మహాసభ జరిగింది. మహాసభల ప్రారంభ సూచకంగా సిఐటియు పతాకాన్ని యూనియన్ గౌరవాధ్యక్షులు వైరాజు గారు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రతినిధుల సభలో గత మూడు సంవత్సరాల కాలంలో యూనియన్ గా చేసిన కార్యక్రమాల రిపోర్టును కార్యదర్శి ప్రవేశపెట్టగా సభ్యులు దానిపై చర్చించి ఆమోదం తెలిపారు. అనంతరం మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన ముఠా కార్మికులకు ఉపాధికి రక్షణ లేకుండా పోతుందన్నారు. పనిలో ప్రమాదం జరిగితే కార్మికులకు ఏ విధంగాను నష్టపరిహారం అందడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ముఠా కార్మికులకు లోడింగ్ అన్ లోడింగ్ కూలి రేట్లు పెంచాలన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే విధంగా కార్మిక చట్టాలను మార్పు చేసి నాలుగు లేబర్ కోడలుగా తీసుకువస్తుందన్నారు ఈ లేబర్ కోర్స్ గనక అమలు జరిగితే కార్మికులు బానిసలుగా మారతారు అన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన సమ్మె జరుగుతుందన్నారు.



ఈ సమ్మెలో ముఠా కార్మికులు యావన్మంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముఠా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలపై చర్చించారు ముటా కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, సమగ్ర చట్టం చేయాలని సొంత ఇల్లు నిర్మాణానికి అవసరమైన స్థలాలు కేటాయించాలని తీర్మానం చేశారు. అనంతరం రాబోయే మూడు సంవత్సరాలకు నూతన కమిటీని ఎన్నుకున్నారు జిల్లా గౌరవ అధ్యక్షులుగా వై రాజు అధ్యక్షులుగా టీ పైడ్రాజు ప్రధాన కార్యదర్శిగా ఎం సుబ్బారావు లతోపాటు 20 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.