29 -12 - 25 సోమవారం ఉదయం 10 గంటలకు మహారాణిపేట, దండు బజార్ లోని, జిల్లా సంఘ భవనంలో 2026-2028 కి గాను అఖిల గాండ్ల తెలుకుల నూతన జిల్లా కమిటీని, జిల్లా యూత్ కమిటీని, జిల్లా మహిళా కమిటీని అఖిల గాండ్ల తెలుకుల జిల్లాఅధ్యక్షులు డాక్టర్ దాడి సత్యనారాయణ ప్రకటించారు. అనంతరం వారందరికీ నియామక పత్రాలు అధ్యక్షుల చేతుల మీదుగా అందజేశారు.
అఖిల గాండ్ల తెలుకుల నూతన అధ్యక్షులుగా డాక్టర్ దాడి. సత్యనారాయణ, కన్వీనర్ గా యెన్నేటి. తాతారావు, ప్రధాన కార్యదర్శిగా చిత్రాడ. అప్పారావు, కార్యనిర్వాహక అధ్యక్షులుగా చిత్రాడ. వెంకట రమణ, కోశాధికారిగా ఎన్నేటి. సన్యాసి రావు, చీప్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నేటి. రమణ(అప్పికొండ), చీప్ వర్కింగ్ సెక్రటరీగా అనపర్తి. త్రినాధరావు, చీప్ అడ్వైజర్ గా ఎన్నేటి. శ్రీనివాసరావు లను తీర్మానించి ప్రకటించారు. దాదాపు 40 మందితో నూతనజిల్లా కమిటీని నియమించారు.
10 మందితో జిల్లా యూత్ కమిటీని నియమించి యూత్ కమిటీ జిల్లా అధ్యక్షులుగా దాడి. లక్ష్మణ్ కుమార్, కార్యదర్శిగా ఎల్లేటి. వరప్రసాద్ ను ప్రకటించారు.
10 మందితో జిల్లా మహిళా కమిటీని నియమించి మహిళా కమిటీ జిల్లా అధ్యక్షురాలుగా శ్రీమతి భీమవరపు. వాణి, కార్యదర్శిగా శ్రీమతి అయినవిల్లి. కుమారి లను పేర్కొన్నారు.
అనంతరం వక్తల అందరూ మాట్లాడుతూ అఖిల గాండ్ల తెలికుల, దేవతెలికుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం, కళ్యాణ మండపము నిర్మాణం కోసం స్థలం ఏర్పాటు విషయమై, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను, మంత్రులను కలిసి, సంఘపరంగా గట్టిగా ప్రయత్నం చేయాలని, సంఘ పురోభివృద్ధికి, కుల బంధువులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవిధంగా కూడా కృషి చేయాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అఖిల గాండ్ల తెలికుల అధ్యక్షులు డాక్టర్ దాడి సత్యనారాయణ అన్ని కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో అఖిల గాండ్ల తెలుకుల అధ్యక్షులు డాక్టర్ దాడి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చిత్రాడ అప్పారావు, మరియు జిల్లా కమిటీ సభ్యులు, ఏ జి టి ఎస్ ఎస్ విశాఖ జిల్లా సభ్యులు పాల్గొన్నారు.




