మహిళకు వాసుపల్లి రూ.10,000లు సాయం

మైనార్టీ మహిళకు వాసుపల్లి రూ.10,000లు సాయం...

మాజీ ఎమ్మెల్యే దాతృత్వం పై ముస్లిం నేతల కృతజ్ఞతలు...



మౌత్ క్యాన్సర్ తో బాధపడుతున్న మైనార్టీ మహిళకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ. 10,000లు ఆర్థిక సాయం  చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 36 వార్డుకు చెందిన జోహార్ బేగం గత కొన్ని నెలలుగా నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. స్థానిక వైసీపీ నేతలు ద్వారా విషయం తెలుసుకొని వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. తక్షణమే సొంత నిధులతో రూ. 10,000 లను మెడికల్ ఖర్చులకు అందజేశారు. బాల్యం నుండి దక్షిణ ముస్లిం మైనారిటీలతో విడదీయరానీ బంధంగా ఏర్పడిందని, వారిలో ఒక కుటుంబ సభ్యుడిగా సహాయం అందించానని వాసుపల్లి తెలిపారు. క్యాన్సర్ వ్యాధి నుండి ధైర్యంగా ఎదుర్కొని సంపూర్ణ ఆరోగ్యంగా మళ్ళీ సాధారణ జీవితం గడపాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఆమెకు భరోసా కల్పించారు. ఒక పక్క పేదరికం మరొకపక్క ప్రమాదకరమైన వ్యాధులతో బాధపడుతున్న దక్షిణ నియోజకవర్గ ప్రజలకు అన్నదమ్ముడిగా తనకి తోచిన సహాయం నిర్వరామంగా అందజేస్తున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, వార్డు అధ్యక్షుడు మహమ్మద్ షకీల్, సౌత్ మేధావుల విభాగం అధ్యక్షుడు పిల్లా అప్పారావు, సౌత్ వీవర్స్ వింగ్  ప్రెసిడెంట్ కాకి పద్మ, సౌత్ వాణిజ్య విభాగం అధ్యక్షులు కడియం ప్రసాద్, మాజీ ధర్మకర్త కంటూముచ్చు సాగర్, జిల్లా నాయకులు జమీల్, చెన్నా శ్రీధర్, సీనియర్ నాయకులు బంగారి సత్యం, కంచు బోయిన కిషోర్, మాధవ్, స్వప్న, శత్రువు, లియాఖత, సుబ్రహ్మణ్యం, షబ్బీర్, సయ్యద్ భాను, మహమ్మద్ సలీం, రఫీ అహ్మద్, స్మిత్, కార్యకర్తలు పాల్గొన్నారు.